తమాషాలు చేస్తున్నావా? బిడ్డా.. ఇంటికొచ్చి నరుకుతా.. గులాబీ ఎమ్మెల్యే బెదిరింపులు
తెలంగాణ అధికారపక్ష నేతలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి సంచలనంగా మారుతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు షాకింగ్ గా మారింది. పటాన్ చెరువు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాజాగా చెలరేగిపోయారు. ఒక దినపత్రికకు చెందిన రిపోర్టర్ సంతోష్ పట్ల చెలరేగిపోయాడు. ఎంత మాట పడితే అంత మాట అనేసిన ఆయన మాటల్ని బీప్ లో వింటేనే వణుకు పుడుతుంది. ఇక.. బీప్ తీసేస్తే.. వినే వారందరి షాక్ తినక మానదు.
ఇంతకీ అధికారపక్ష ఎమ్మెల్యే అంతలా బూతులు మాట్లాడటానికి కారణం.. ఆయన నియోజకవర్గంలోని అక్రమాలు.. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వార్త ఒకటి పేపర్లో రావటంతో ఆయన చెలరేగిపోయారు. ఏం సంతోష్.. ఇంటికి వస్తానన్నావ్? రాలేదేం? నీలా బలిసినోడ్ని అయితే కాదు.. మర్యాదగా ఇంటికిరా.. లేకుంటే కాళ్లు.. చేతులు నరుకుతా బిడ్డా అంటూ రాయలేని బూతుమాటల్నివాడేసిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తాను మాట్లాడే గలీజు మాటల్ని రికార్డు చేసుకోవలని.. ఎస్పీ.. డీజీ.. ఎవరికి ఇస్తావో ఇచ్చుకో అంటూ చెలరేగిపోతున్న తీరు.. అందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాను చెప్పినట్లుగా ఇంటికి రాకుంటే.. ఇంటికి వచ్చి మరీ నరికి చంపేస్తానని చెప్పటం గమనార్హం. పార్టీ నేతల అక్రమాలు రాస్తే బెదిరిస్తారా అన్నా? అంటూ సదరు రిపోర్టర్ పేర్కొంటే.. మాట్లాడొద్దు.. ముందుకు ఇంటికి వస్తావా? రావా? అని ప్రశ్నించటం కనిపిస్తుంది. ఇటీవలకాలంలో టీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణి పెరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు తగ్గట్లే తాజాగా వెలుగు చూసిన ఆడియో క్లిప్ ఇప్పుడు సంచలనంగా మారింది. పార్టీ ఇమేజ్ ను ఇంత దారుణంగా దెబ్బ తీస్తున్న ఎమ్మెల్యే వారి పైన గులాబీ బాస్ ఏ తీరులో చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కేసీఆర్ సార్ మరేం చేస్తారో చూడాలి.
Full View