ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏడాదిన్నర పాలనలో దారుణ పరాభవమేదీ అని అడిగితే ఇప్పుడు చాలామంది ఆపరేషన్ పఠాన్ కోట్ అని చెబుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లోని అత్యం భద్రత మధ్య ఉండే అత్యంత కీలకమైన భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయడం ఒక ఎత్తు అయితే.. వరుసగా మూడో రోజు కూడా ఆపరేషన్ ను ముగించకపోవడం మోదీ ప్రభుత్వ వైఫల్యంగా చెబుతున్నారు.
పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే, సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న అత్యంత కీలకమైన వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడిని అడ్డుకోలేకపోవడం ఒక వైఫల్యంగా చెబుతున్నారు. ఒకవేళ దానిని పక్కన పెట్టినా.. జాతీయ భద్రతా సలహాదారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించినా.. వెంటనే ఎన్ ఎస్ జీ కమెండోలను మోహరించినా ఇప్పటికి మూడో రోజు పూర్తవుతున్నా ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో మట్టుబెట్టలేకపోయారు. ఇంకా మరొక ఉగ్రవాది దాక్కుని ఉన్నాడనిఅంటున్నారు. ఈ నేపథ్యంలోనే మూడో రోజు కూడా ఉగ్రవాదులను మట్టుబెట్టకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.