తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మహిళా పాత్రికేయురాలు లక్ష్మీ సుబ్రమణియన్‌తో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. ద వీక్ పత్రిక జర్నలిస్టు లక్ష్మీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేస్తూ ఆమె చెంపను తట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గవర్నర్ పురోహిత్ ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు వస్తున్న క్రమంలో ద వీక్ పత్రిక మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రమణియన్‌కు క్షమాపణలు చెప్పారు.
మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత జర్నలిస్టు లక్ష్మీ చెంపను గవర్నర్ పురోహిత్ తాకడం వివాదాస్పదమైంది. ఆ ఘటన పట్ల మనోవేదనకు గురైనట్లు ఆ జర్నలిస్టు తన కథనంలో పేర్కొన్నారు. ఆ అంశంపై ఇవాళ గవర్నర్ పురోహిత్ వివరణ ఇచ్చారు. ``మనవరాలిగా భావిస్తూ చెంపను తాకాను. జర్నలిస్టుగా నువ్వు అడిగిన ప్రశ్నను మెచ్చుకుంటూ అలా చేశాను నీ ఆ ఘటన పట్ల నువ్వు మనోవేదనకు గురైన అంశాన్ని గుర్తించాను. దాని పట్ల క్షమాపణలు కోరుతున్నాను` అని గవర్నర్ తెలిపారు. దీనిపై రిప్లై మెయిల్ ఇస్తావని కూడా ఆశిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. అయితే ఈ క్షమాపణల పర్వం తర్వాత కూడా ఎపిసోడ్ మలుపులు తిరిగింది. గవర్నర్ క్షమాపణలు చెప్పిన అంశం పట్ల జర్నలిస్టు లక్ష్మీ స్పందించారు. క్షమాపణలు స్వీకరించినా, తనను మెచ్చుకున్న తీరు మాత్రం బాగాలేదని ఆమె మెయిల్ చేయడం ఆసక్తికరంగా మారింది.