అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన గుళ్లపల్లి పావని మృతదేహం వరంగల్ కు చేరింది. అక్టోబర్ 25న అమెరికాలోని కనెక్టికట్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పావని మృతిచెందింది. మరణించిన 9 రోజుల తర్వాత వరంగల్ లోని గిర్మాజీపేటకు పావని మృతదేహం చేరుకుంది. పావని మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కల్పన, రమేశ్, సోదరి వాసవి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కూతురు మరణం తట్టుకోలేక ఆమె తల్లి కల్పన నాటి నుంచి ఏడుస్తూనే ఉంది. తాజాగా కూతురి మృతదేహం చూడగానే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఉన్నత చదువుల కోసం రెండు నెలల క్రితమే పావని ఇంటి నుంచి అమెరికాకు బయలుదేరింది. తాజాగా అక్కడ యాక్సిడెంట్ లో మృతిచెందింది. విగతజీవిగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనల మధ్యే పావని అంత్యక్రియలు ముగిశాయి.
అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.. వీరిలో తెలంగాణకు చెందిన ఒక యువకుడు, యువతి, ఏపీకి చెందిన ఓ యువకుడు ఉన్నారు. మరో నలుగురు తెలుగువాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది.
వీకెండ్ కావడంతో స్నేహితులందరూ కలిసి కారులో ట్రిప్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న మినీ వ్యాను, ఓ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో మినీ వ్యానులో 8 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. తమ కలలు నెరవేర్చుకుందామని అమెరికా వెళ్లిన విద్యార్థులు ఇలా మరణించడంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం నిండింది.
తెలంగాణలోని వరంగల్ కు చెందిన పావని , హైదరాబాద్ కు చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన సాయినరసింహలు కనెక్టికట్ రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. వీకెండ్ టూర్ కు వెళ్లివస్తుండగా మంగళవారం ఉదయం 6 గంటలకు మినీ వ్యాన్, కారు ఢీకొన్న ప్రమాదంలో మరణించారు.
పొగమంచు కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈ ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కారులో ఉన్నవారిని అంతర్జాతీయ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు, ఆరుగురు న్యూ హెవెన్ విశ్వవిద్యాలయంలో , ఒకరు సేక్రేడ్ హార్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్టు గుర్తించారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పావని మరణించగానే ఆమె తల్లిదండ్రులైన వరంగల్ వాసులకు సమాచారం అందింది. అప్పటి నుంచే వీరి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.