బీజేపీకి ఛాన్సిచ్చేశావుగా ప‌వ‌నూ...!

Update: 2022-10-19 06:32 GMT
ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు అండ‌గా ఉంటాడ‌ని.. త‌మ ప‌క్షాన నిలుస్తాడ‌ని భావించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అనూహ్యంగా తీసుకున్న నిర్ణ‌యం.. క‌మ‌ల నాథుల్లో క‌ల‌వ‌రం రేపింది. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీతో చెలిమి చేయాలని బీజేపీలోని కొంద‌రు నాయ‌కులు.. స‌త్య‌కుమార్‌, కామినేని శ్రీనివాస్‌, పురందేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ, సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌ వంటివారు.. త‌ల‌పోస్తున్నారు. కానీ, దీనికి కేంద్రంలోని బీజేపీ నాయ‌క త్వం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి.. సిగ్న‌ల్స్ రాలేదు.

దీనికి కార‌ణం.. వైసీపీ ఓటు బ్యాంకు స్థిరంగా ఉంద‌ని.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు భావిస్తుండ‌డమే. పైగా.. బీజేపీ పోటీ చేసినా..పుంజుకుంటుందా.. లేదా..అనేది సందేహం. ఈ క్ర‌మంలోనేఈ విష‌యాన్ని ఎటూ తేల్చ‌కుండా..పవ‌న్ కోరిన‌ట్టు ఎలాంటి రోడ్ మ్యాప్ ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎన్నిక‌ల స‌మయానికి అంటే.. ఆరు మాసాల ముందు.. అప్ప‌టి ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుని.. దానికి త‌గిన విధంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. ముఖ్యంగా సోము వీర్రాజు... విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి, జీవీఎల్ న‌ర‌సింహారావు వంటివారు.. టీడీపీతో విభేదిస్తున్నారు.

వీరు.. జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉన్నా.. టీడీపీకి మాత్రం వ్య‌తిరేకంగా ఉన్నారు. కేంద్రంలో మోడీని అధికారంలోకి రాకుండా.. అడ్డుకునేందుకు చంద్ర‌బాబు గ‌తంలోల చేసిన ప్ర‌య‌త్నాల‌ను వీరు మ‌రిచిపోలేక పోతున్నారు.

ఈ క్ర‌మంలోనే అవ‌స‌ర‌మైతే.. ఒంట‌రిగా అయినా.. పోటీ చేస్తామ‌ని.. త‌ర‌చుగా.. ఈ బృందం చెబుతోంది. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. జ‌న‌సేన క‌నీసం.. బీజేపీకి ఎలాంటి సూచ‌న‌లు చేయ‌కుండానే వెళ్లి టీడీపీతో క‌లిసిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌తో ఉన్నాడ‌ని అనుకున్న నాయ‌కుడు తీసుకున్న అనూహ్య నిర్ణ‌యం.. క‌మ‌ల నాథుల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది.

ఈ క్ర‌మంలో అస‌వ‌ర‌మైతే.. త‌న నిర్ణ‌యాన్నిమార్చుకునేందుకు బీజేపీ సిద్ధంగానే ఉంద‌ని అంటున్నారు. కుదిరితే.. వైసీపీతోనే లోపాయికారీ ఒప్పం దం చేసుకుని ముందుకు వెళ్లినా ఆశ్చ‌ర్యంలేద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. త‌మ‌కు 10 సీట్లు కేటాయించినా.. చాల‌ని.. బీజేపీ నాయ‌క‌త్వ కోరే అవ‌కాశం ఉంది.

ఇలాంటి స్థానాల‌ను పెద్ద‌గా వైసీపీ వెతికి ప‌ట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. త‌మ‌కు వీక్‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రోక్షంగా స‌హ‌క‌రించే అవ‌కాశం లేక పోలేదు. ఏదేమైనా.. బీజేపీ ఇప్పుడు ఓన్ నిర్ణ‌యం తీసుకునే అవకాశం ప‌వ‌నే క‌ల్పించార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News