ఫస్ట్ టైం జగన్ మీద పవన్ ఆ రేంజిలో....!

Update: 2023-06-26 22:00 GMT
పవన్ కళ్యాణ్ సీఎం జగన్ని ఎపుడూ విమర్శిస్తారు. అందులో మజా ఏముంది. కొత్త విషయం ఏముంది అని అంతా అనుకుంటారు. ఆయన జగన్ గురించి మాట్లాడినపుడు అవినీతి అక్రమాలు అంటూ చెబుతూ వస్తారు ఇక సీఎం అయ్యాక జగన్ పాలన లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చాలా కామెంట్స్ చేశారు.

కానీ ఫస్ట్ టైం సీఎం కాక ముందు జగన్ ఏమి చేసేవారో పవన్ విడమరచి చెప్పుకొచ్చారు. జగన్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సభలో మాట్లాడుతూ జగన్ హైదరాబాద్ లో కూర్చుని దందాలు చేసేవారు అని డైరెక్ట్ గానే ఘాటు విమర్శలు చేశారు. జగన్ అవినీతికి హద్దులు లేవని అని మండిపడ్డారు.

జగన్ కి వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఏ అవినీతి లేకపోతే ఇంత సంపాదన వచ్చేదా అని ప్రశ్నించారు. తాను 2019లో రెండు చోట్ల ఓడిపోయినా బాధపడలేదు కానీ అవినీతిపరులు గద్దెనెక్కినందుకే చాలా బాధ పడ్డానని, ఆవేదన కూడా చెందాను అని ఆయన చెప్పుకొచ్చారు.

తాను అంబేద్కర్ సిధ్దాంతాల ను ఆచరణ లో పాటించే నాయకుడిని అని అలాంటి తనను జనం ఓడించారని ఆయన అన్నారు. తాను జగన్ ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం తన ప్రాణం ఉన్నంతవరకూ సాగుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. తనని ఎంత తిట్టినా ద్వేషించినా భరిస్తాను కానీ వైసీపీ నాయకులు అవినీతి చేస్తే మాత్రం తాను చూస్తూ ఊరుకోరని తుదికంటా పోరాడి తీరుతాను అని ఆయన హెచ్చరించారు.

వైసీపీ పాలకులు ప్రజల చమటనే కాదు రక్తాన్ని పీల్చేస్తున్నారు అని సంచలన కామెంట్స్ పవన్ చేశారు. ఇలాంటి పాలన కు వ్యతిరేకంగానే తాను పోరు బాట పట్టాను అని ఆయన అన్నారు. ఏపీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాను అని ఆయన ప్రకటించారు.

ప్రజలు మారారని, రోజులు ఎపుడూ ఒకలా ఉండవని జగన్ గుర్తు పెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎల్లకాలం ప్రజల ను మోసం చేస్తామంటే కుదరదు అని వైసీపీ నేతల కు వార్నింగ్ ఇచ్చారు. వర్తమాన రాజకీయాల్లోకి ప్రజల క్షేమం కాంక్షించే నాయకులు రావాల ని ఆయన కోరారు. అలాంటి వారి కోసమే తాను ఎదురు చూస్తున్నాను అని ఆయన అన్నరు. ఏపీ లో వైసీపీ పాలన ను ముగించేందుకు తాను పోరాటం చేస్తున్నాను అని ఈ పోరాటం లో తాను బతికి ఉంటానో లేదో కూడా తెలియదు అంటూ పవన్ సంచలన కామెంట్స్ చేయడం విశేషం.

మొత్తం మీద జగన్ దందాలు చేసి వేల కోట్లు సంపాదించారు అంటూ పవన్ చేసిన కామెంట్స్ మొత్తం వారాహి యాత్ర లోనే హైలెట్ గా నిలిచాయి. జగన్ మీద అల్టిమేట్  కామెంట్స్  గా కూడా వీటిని చూస్తున్నారు. దీనికి వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా వస్తుందో చూడాల్సి ఉంది.

Similar News