ఏపీ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని.. తనకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటోందని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఆయన ఇదే విషయాన్ని ట్వీట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. విశాఖలో జరిగిన ఉదంతంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో పవన్ కూడా.. ఇప్పుడు తాను ఈ విషయాన్ని వదిలేస్తే.. అభిమానులు.. పార్టీ కేడర్‌లో చులకన అవుతానని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆయన ఈ విషయాన్ని ఇప్పటితో వదిలి పెట్టేలా కనిపించడం లేదని అంటున్నారు. విశాఖలో పార్టీ అనుచరులు, అభిమానులను పోలీసులు అరెస్టు చేయడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు.
ఎందుకంటే.. పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. గతంలో హవా ఉన్నా.. ఇప్పుడు అది ఓటు బ్యాంకుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో పార్టీ తరఫున పోరాడేవారిని.. తన అభిమానులను కాపాడుకునేందుకు పవన్ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన విశాఖ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడం.. హోటల్‌కే పరిమితం చేయడం(నిర్బంధించడం), తన భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడంపై పవన్ రగిలిపోతున్నారు. అయితే..దీననిని మాటల కంటే కూడా.. చేతల ద్వారా.. సర్కారును ఇరుకున పెట్టి.. ప్రజల్లోకి వెళ్లాలనే వ్యూహంతో ఉన్నారని అంటున్నారు.
దీనిలో భాగంగానే.. ఆయన రాత్రంతా కూడా నిద్ర పోలేదని జనసేన నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. తన కుఅందుబాటులో ఉన్నవారితో తదుపరి కార్యాచరణపై పవన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విషయాన్ని కేంద్రంలో ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదని.. అడుగడుగునా.. పోలీసు రాజ్యం ఉందని..ఆయన చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తలుస్తోంది.
అయితే.. తొలిగా.. రాష్ట్రంలో ప్రధమ పౌరుడుగా ఉన్న గవర్నర్‌కు విన్నవించి.. తదుపరి ఢిల్లీ పెద్దలను కలవాలని భావిస్తున్నట్టు జనసేన వర్గాలుచెబుతున్నాయి. ప్రస్తుతం పవన్‌తో పొత్తుతో ఉన్న బీజేపీ స్పందించేలా చేసి.. సర్కారుకు తగిన విధంగా.. లెస్సన్ చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.