కాకినాడ సిటీ నియోజకవర్గం ఇపుడు రాజకీయ కాక రేపుతోంది. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ లో వారాహి యాత్ర చేస్తూ సర్పవరం జంక్షన్ లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చేసిన హాట్ కామెంట్స్. ఆయన్ని రాజకీయంగా ఓడించకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని పవన్ అతి పెద్ద సవాల్ చేశారు.
దానికి ప్రతిగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కి రివర్స్ చాలెంజ్ చేశారు. తనను ఓడించడానికి వారూ వీరూ ఎందుకూ పవనే నేరుగా తనతో పోటీకి దిగాలని కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తే విజేత ఎవరో జనాలే డిసైడ్ చేస్తారని స్పష్టం చేశారు.
అంతే కాదు ఆ మరుసటి రోజు కూడా అదే సవాల్ ని రిపీట్ చేశారు. కాకినాడ వదిలి వెళ్తున్న పవన్ తన సవాల్ ని స్వీకరించలేదని ద్వారంపూడి అన్నారు. తన మీద పోటీకి పవన్ కి పర్మిషన్ చంద్రబాబు నుంచి రావాల్సి ఉందని కూడా ఎద్దేవా చేశారు.
అయితే దీనికి జనసేన కాకినాడ నేతల నుంచి ద్వారంపూడికి ఘాటైన రియాక్షన్ వచ్చింది. కాకినాడ సిటీ నుంచి ముత్తా శశిధర్ పోటీ చేస్తారని వైసీపీ నుంచి ఏకంగా సీఎం జగన్ పోటీకి దిగాలని ప్రతి సవాల్ చేశారు. జగన్ పోటీ చేసినా జనసేన సత్తా చాటుకుంటామని వారు అంటున్నారు.
అంటే ద్వారంపూడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తా శశిధర్ కి పోటీ చేయడానికి సరితూగరా అని ఒక ప్రశ్న వస్తోంది. అంతే కాదు వైసీపీలో కొన్నాళ్ళు ఉన్న ముత్తా శశిధర్ ఏకంగా జగన్నే ఓడిస్తారా అని వైసీపీ నేతలు అంటున్నారు.
ద్వారంపూడి అవినీతిపరుడు అని ఆయన రాజకీయ జీవితం సమాప్తం అని పవన్ అన్నారు కాబట్టే ఎమ్మెల్యే సవాల్ చేశారని మధ్యలో జగన్ ప్రస్తావన ఎందుకు అంటున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పోటీకి రావాలని కోరితే జనసేన నేతలు జగన్ అంటున్నారు.
మొత్తానికి చూస్తే కాకినాడ సిటీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి జగన్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా ఢీ కొంటారా అన్నదే చర్చగా ఉంది. జగన్ ఎపుడూ పులివెందుల నుంచే పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఏంటో ఇంకా తేలలేదు. ఈ నేపధ్యంలో పవన్ గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తే కాకినాడ సిటీని ఎంచుకోవాలని ద్వారంపూడి సవాల్ చేస్తున్నారు.
ఏది ఏమైనా కాకినాడ రాజకీయాలు మాత్రం ఈ సవాళ్ళూ ప్రతి సవాళ్ళతో మంచి కాక మీద ఉన్నాయని అంటున్నారు. నిజంగా పవన్ జగన్ పోటీకి దిగితే ఆ కధే వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. కానీ అలా జరుగుతుందా. జస్ట్ సరదాకేనా ఈ సవాళ్ళూ చాలెంజిలు అన్న మాట కూడా ఉంది మరి.