తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వైఎస్ షర్మిల చేసిన ప్రకటనపై రాజకీయవర్గాలన్నీ తలో తీరుగా స్పందిస్తున్నాయి. తెలంగాణ పార్టీలు విమర్శలు గుప్పిస్తుండగా.. ఆంధ్రా పార్టీల నేతలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. తెలంగాణలో ఆంధ్రా నేతల పార్టీని ఇక్కడి వారు జీర్ణించుకోవడం లేదు.
కాగా తెలంగాణలో పార్టీ పెట్టాలనే షర్మిల నిర్ణయంపై తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. ఢిల్లీలో అమిత్ షాను కలిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చని.. అందరికీ హక్కు ఉందని.. కొత్త వాళ్లు రావాలని తాను కోరుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆమె ఇంకా పార్టీని ఫామ్ చేయలేదని.. చేయబోతున్నారని.. పార్టీని స్తాపించి వారి విధివిధానాలు తెలియజేసినప్పుడు తాను స్పందిస్తానని పవన్ అన్నారు.
షర్మిల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాట్లాడితే బాగుంటుందని.. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి వచ్చే హక్కు, అవకాశం ఉందని పవన్ అన్నారు. ఎవరైనా రావచ్చని.. అందులో తప్పేం ఉంది అని షర్మిల కొత్త పార్టీని స్వాగతించారు పవన్ కళ్యాణ్.