‘తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికపై బీజేపీ, జనసేన పార్టీల నేతలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటాం..అంతవరకు ఈ విషయమై ఎవరు మాట్లాడవద్దు’ .. ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆదేశాలు. పార్టీ ముఖ్యనేతలతో పవన్ అనేక అంశాలపై టెలికాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చినా చివరగా తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక విషయం కూడా ప్రస్తావనకొచ్చింది.
ఈ సందర్భంగా నేతలతో పవన్ మాట్లాడుతూ పై తిరుపతి లోక్ సభ పోటీ విషయమై ఎక్కడా బహిరంగంగా మాట్లాడవద్దని కట్టడి చేయటమే విచిత్రంగా ఉంది. ఉపఎన్నికలో ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయంపై ఇంకా నిర్ణయం కాలేదని పవన్ తన నేతలను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా అర్ధమవుతోంది. ఒక వైపేమో బీజేపీనే ఉపఎన్నికలో పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగంగానే ప్రకటించేశారు. ఇదే సమయంలో కమలంపార్టీ నేతలు బీజేపీ అభ్యర్ధికే ఓటు వేయాలంటూ ప్రచారం కూడా ప్రారంభించేశారు.
ఈ విషయాలన్నీ ప్రముఖంగా మీడియాలో వచ్చిన విషయాన్ని అందరు చూస్తున్నారు. జనసేన మద్దతుతో ఉపఎన్నికలో పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్ధిని గెలిపించాలంటూ వీర్రాజు శోభాయాత్రలో మాట్లాడిన విషయం అందరు విన్నదే. వీర్రాజు మాటలతో, బీజేపీ నేతల ప్రచారంతో ఉపఎన్నికలో పోటీ చేయబోయే పార్టీ ఏదనే విషయంలో జనాలకు క్లారిటీ వచ్చేసింది. ఇంతమందికి ఇంత స్పష్టంగా క్లారిటి వచ్చేసిన పవన్ మాత్రం ఇంకా భేటి జరగలేదని, ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయం నిర్ణయం కాలేదని అబద్ధాలు చెబుతుండటమే విచిత్రంగా ఉంది.
ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయంలో ఇంతమందికి క్లారిటి వచ్చినపుడు పవన్ కు మాత్రం ఎందుకుండదు ? కచ్చితంగా ఉంటుందనటంలో సందేహమే లేదు. కాకపోతే తన చేతకానితనాన్ని పార్టీ నేతల ముందు అంగీకరించలేక వాళ్ళని మబ్య పెడుతున్నారు. పోనీ బీజేపీకన్నా జనసేన ఏమైనా బలంగా ఉన్న పార్టీనా అంటే అదీలేదు. పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు పార్టీ నిర్మాణమే జరగలేదు. గ్రామస్ధాయినుండి రాష్ట్రస్ధాయి వరకు కమిటిల నిర్మాణాన్నే పవన్ వేయలేదు. ఇలాంటి పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే జనాలెందుకు ఓట్లేస్తారు ?