ఏపీ ప్రత్యేక హోదా విషయం రాజ్యసభలో రచ్చరచ్చ అవుతున్న తరుణంలో చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్పందన కూడా ఇంతకుముందులా గోడ మీద పిల్లివాటంగా కాకుండా ఘాటుగా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే పవన్ తన సన్నిహిత వర్గాల వద్ద ప్రత్యేక హోదా అంశంపై చర్చించారని.. కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టారని తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ - ప్రధాని మోడీ ఈ విషయంలో పట్టించుకోకుండా ఉండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారట.
కొద్దికాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఉంటున్న పవన్ ఇంతకాలం తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే, ఆ సినిమా రిలీజ్ కావడం.. దెబ్బతినడంతో ఆయన మళ్లీ ఖాళీగానే ఉన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో రాజకీయాలపై దృష్టిపెట్టారని.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మథనపడుతున్నారని టాక్. ఏపీకి హోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుకు ఏపీలోని రాజకీయ పార్టీలతోపాటు పొరుగు రాష్ర్టం తమిళనాడులోని డీఎంకే కూడా మద్దతు ప్రకటించినా బీజేపీ మాత్రం అడ్డుకోవడంపై ఆయన సీరియస్ అయ్యారని.. ఆర్థిక బిల్లుల కారణంగా చర్చ - ఓటింగ్ పెట్టడం కుదరంటూ ఆర్థికమంత్రి జైట్లీ - సభా ఉపాధ్యక్షుడు కురియన్ చెప్పడంపై పవన్ మండిపడ్డారని సన్నిహితులు చెబుతున్నారు.
మరోవైపు ఈ విషయంలో కేంద్ర మంత్రి - ఏపీకి చెందిన బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు వ్యవహార శైలిపైనా పవన్ గుర్రుగా ఉన్నారని.. కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర ఏళ్లుపైగానే గడిచినా ఇంకా మాటలతో మోసం చేస్తోందని ఆయన అన్నారని సమాచారం. ఈ విషయంలో బీజేపీ వైఖరి సరిగాలేదని, ఎన్నికల ముందు ఒకలా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకలా వ్యవహరిస్తే, ప్రజలు సరైన బుద్ధిచెబుతారని అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ఆయన విభజన విషయంలో కాంగ్రెస్ కు ప్రజలు షాకిచ్చినట్లే బీజేపీకి కూడా షాకివ్వడం ఖాయమని శాపనార్థాలు పెట్టారని... దీనిపై నేరుగా మోడీతోనే తేల్చుకోవాలని అన్నట్లు తెలుస్తోంది. అయితే... ఈ విషయంలో పవన్ తన పవర్ చూపిస్తారో లేదంటే ఇంతకుముందులాగే తుస్సుమనిపిస్తారా అన్నది వేచిచూడాలి.