తిరుమల లో తాను బస చేసిన టీఎస్సార్ అతిథి భవనం నుంచి తిరుపతి లోని బహిరంగ సభకు బయల్దేరుతున్న సందర్భంలో పవన్ కల్యాణ్ కు అనుకోని చేదు అనుభవం ఎదురైంది. పవన్ కల్యాణ్ అతిథి భవనం లోంచి బయటకు రాగానే.. ఆయనను చూడడానికి నిన్నటినుంచి అక్కడే నిరీక్షిస్తున్న వందల మంది అభిమానులు ఎగబడ్డారు. అనుకోకుండా అక్కడ తోపులాట జరిగింది. పవన్ కల్యాణ్ కు సమీపంగా వెళ్లడానికి అందరూ ఎగబడడంతో తోపులాట పెరిగింది. జనం ఒకరినొకరు తోసుకుంటూ.. తన మీద పడిపోవడంతో.. జనం మధ్యలో ఇరుక్కుపోయిన పవన్ కల్యాణ్ అదుపు తప్పి కింద పడిపోయారు. నేల మీద పడకముందే.. పక్కనే ఉన్న ఆయన అనుచరులు ఒక్క ఉదుటున ఆయనను పట్టుకున్నారు. పవన్ అంతలోనే తేరుకుని.. వడివడిగా నడుచుకుంటూ వాహనం వద్దకు వెళ్లిపోయారు.
తిరుమలలో పవన్ బసచేసిన అతిథి భవనం వద్ద నిన్న ఉదయం నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనను చూడడానికి నిరీక్షిస్తున్నారు . మధ్యలో కూడా పవన్ బయటకు వచ్చి వారికి కనిపించలేదు. వందల మంది అలాగే వేచి ఉన్నారు. సభకు బయల్దేరడానికి బయటకు వచ్చేసరికి అందరూ తోసుకున్నారు. ఆ తోపులాటలో ఆయనే పడిపోయే పరిస్థితి వచ్చింది. పైగా పోలీసులు కూడా కొద్ది సంఖ్యలోనే ఉన్నారు.
అక్కడినుంచి కొద్దిమంది అనుచరులతో ఆయన తిరుపతికి బయల్దేరి వెళ్లారు.