సీపీఎం..సీపీఐ పార్టీ నేతలతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన పాదయాత్రలో ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. 3.5 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర సందర్భంగా భారీ ఎత్తున కోలాహలం చోటు చేసుకుంది.
పాదయాత్ర ప్రారంభంలో పవన్ కల్యాణ్ తో పాటు.. సీపీఎం మధు.. సీపీఐ రామకృష్ణలు కూడా మాట్లాడారు. విభజన సమయంలో ఆస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్.. నాయకులు అమ్ముడుపోతారేమో కానీ.. ప్రజలు.. ప్రజా నాయకులు మాత్రం ఎప్పటికీ అమ్ముడుపోరన్నారు.
షెడ్యూల్ ప్రకారం ముందుగా నిర్ణయించిన బెంజ్ సర్కిల్ దగ్గర పవన్ పాదయాత్ర మొదలైంది. రామవరప్పపాడు వరకూ సాగే ఈ యాత్ర హోదా సాధన ఉద్యమంలో తొలి అడుగుగా పవన్ అభివర్ణించారు. హోదా కోసం తాము నిజాయితీగా పోరాటం చేస్తున్నట్లు పవన్ చెప్పారు. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు హోదా సాధన విషయంలో చిత్తశుద్ధి లేదన్నారు.
రానున్న రోజుల్లో ఉద్యమాల ద్వారా హోదా సాధన కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేస్తామన్నారు ఎర్రటి ఎండలో పాదయాత్ర చేస్తుండటంతో చాలా త్వరగా చెమటలు పట్టేశాయి. దీనికి తోడు విజయవాడ ఎండ చురుకు పుట్టేలా ఉండటంతో చాలా త్వరగా బట్టలు మొత్తం చెమటలు పట్టేశాయి. పాదయాత్ర స్టార్ట్ అయిన కొద్దిసేపటికే సీపీఎం మధు ఎండ వేడికి తాళలేక తన చొక్కాను విప్పేశారు.
దీంతో.. ఆయన చొక్కాను తీసుకున్న పవన్ తన చేతిలో వేసుకొని ముందుకు కదిలారు. పాదయాత్రను త్వరగా ముగించాలని.. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో.. సాధారణ ప్రజానీకానికి పాదయాత్ర ఇబ్బందికి గురి చేస్తుందని పోలీసులు కోరారు. నేషనల్ హైవే మీద ట్రాఫిక్ ను ఎక్కువ సేపు ఆపలేమని.. త్వరగా పాదయాత్రను ఆపేయాలని పోలీసులు పదే పదే చెప్పటం కనిపించింది.