ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గరకు వెళుతున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకటి తర్వాత ఒకటిగా ఆయన తెర మీదకు వస్తున్న సమస్యలు చూసినప్పుడు.. ప్రజాసమస్యలపై పవన్ మిగిలిన వారి కంటే భిన్నంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. శ్రీకాకుళం ఉద్దానం సమస్యను తెర మీదకు తీసుకొచ్చిన పవన్..తాజాగా పోలవరం డంపింగ్ బాధిత ప్రజలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మిగిలిన వారి మాదిరి తాను తొందరపడి మాట్లాడనని.. పార్టీ నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తానని.. ప్రజారాజ్యం పార్టీ నుంచి తాను కొన్ని పాఠాలు నేర్చుకున్నానని వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ సందర్భంగా తనను కలిసి రైతులకు ఊరట కలిగించేలా మాట్లాడిన పవన్.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కనిపించే సమస్యలతో పాటు.. కనిపించని సమస్యలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
రైతుల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలన్న పవన్.. కాంట్రాక్టర్ల లాభాల కోసం రైతులను ఇబ్బంది పెట్టటం సరికాదని వ్యాఖ్యానించారు. పోలవరం రైతుల సమస్యలపై ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన కోసం రెండు.. మూడురోజులు ఎదురుచూస్తానని.. అనంతరం ఈ వ్యవహారంపై తన కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. తమ సమస్యలు చెప్పుకోవటానికి ప్రజలు వచ్చినప్పుడు తాను గట్టిగా మాట్లాడకుండా నెమ్మదిగా మాట్లాడుతున్నానన్న విమర్శపై స్పందించిన పవన్.. గట్టిగా మాట్లాడామా? ఘర్షణ పడ్డామా? అన్నది ముఖ్యం కాదని.. సమస్యకు పరిష్కారం ముఖ్యమన్న ఆయన.. గట్టిగా మాట్లాడటం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా? అని ప్రశ్నించారు.
ఓపక్క ప్రజారాజ్యం అనుభవాన్ని ప్రస్తావిస్తూ.. తొందరపడనని చెబుతూనే..సమస్యల పట్ల తనకున్న వైఖరి ఎలాంటిదో వివరించే ప్రయత్నం తాజా మాటల్లో కనిపిస్తుందని చెప్పాలి. ఒకటి తర్వాత ఒకటిగా తెర మీదకు తీసుకొస్తున్న ప్రజా సమస్యలు ఏపీ సర్కారుకు కనువిప్పు అవుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/