ప‌వ‌న్ ప‌లుకులు మారాయిగా..నాడు కులం వ‌ద్దు..నేడు ముద్దు...!

Update: 2019-07-28 10:38 GMT
రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఎలాగైనా నాయ‌కులు త‌మ వ్యూహాల‌ను తీర్చి దిద్దుకోవ‌చ్చు. అది.. రాజ‌కీయాల్లో త‌ప్పుప‌ట్ట‌లేని ప‌రిణామం. స‌మ‌యానికి త‌గు మాట‌లు చెప్ప‌డంలో నాయ‌కుల‌ను మించిన వారు మ‌రొక‌రు ఉండ‌రు. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టి తీరుతారు. అందుకే రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల నాలుక‌లకు న‌రాలు ఉండ‌వ‌ని అంటుంటా రు. అయితే, దీనికి భిన్న‌మైన రాజ‌కీయాలు చేస్తాన‌ని - ప్ర‌తి ఒక్క‌రిలోనూ విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని కీర్తించ‌బ‌డ‌తాన‌ని చెప్పుకొచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఒక్క ఓట‌మితోనే అస‌లు రాజ‌కీయాలు తెలుసుకున్నట్టు న్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో తాను స్వ‌యంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి పోటీ చేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఘోరంగా ఓడిపోయారు. ఇక‌ - త‌న పార్టీ క‌నీసం 20 నుంచి 30 వ‌ర‌కు సీట్ల‌లో ప్ర‌భావం చూపుతుంద‌ని అనుకున్నా.. అది కూడా సాధ్యం కాలేదు. తెలంగాణ వాళ్లు ఏపీ వాళ్ల‌ను కొడుతున్నార‌ని చెప్పుకొన్న ప‌వ‌న్‌.. ఏపీ వారికి భ‌రోసా ఇవ్వ‌లేక పోయారు. వీట‌న్నింటికంటే ముఖ్యంగా రాజ‌కీయాల్లో కులాల‌కు తాను వ్య‌తిరేక‌త‌మ‌ని - మాన‌వ‌త్వ‌మే త‌న మ‌త‌మ‌ని - కుల‌మ‌ని మ‌రో వివేకానందుడి అప‌రావ‌తారం త‌న‌దేన‌ని చెప్పుకొచ్చారు ప‌వ‌న్‌. అందుకే త‌న‌కు ఏకుల‌మూ ఆపాదించ‌వ‌ద్దంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇదే సిద్ధాంతంతో.. తాజాగా జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అయితే, ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. కేవ లం ఒకే ఒక్క‌రు మాత్ర‌మే గెలిచారు. ఇక‌, ఇప్పుడు పార్టీని సంస్థాగ‌తంగా ముందుకు న‌డిపించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. వ‌చ్చే ఐదేళ్ల పాటు పార్టీని నిల‌బెట్టి, న‌డిపించాల్సిన బాధ్య‌త ప‌వ‌న్‌ పైనే ఉంది. మ‌రి ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్లంటే ప‌రిస్థితి బాగుంటుందా? ఇప్పుడు ఇదే చ‌ర్చ‌కు దారితీస్తున్న ప‌రిణామం. ఈ క్రమంలోనే ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కులాన్ని ఖ‌చ్చితంగా గుర్తించాలని ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో చేసిన ప్ర‌సంగంలో పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది.

``కులాన్ని గుర్తించాలని - ఎందుకంటే మన సమాజం భిన్న కులాల సమాహారం అని ఆయన అన్నారు. 'అలాగని కుల ప్రాతిపదికన పార్టీని నడపటం సాధ్యం కాదు. జనసేన పార్టీ భావి తరాల ప్రయోజనం కోసం, నవతరం రాజకీయ నాయక త్వాన్నితీర్చిదిద్దే క్రమంలో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో విస్తృత రాజకీయ ప్రయోజనాలతోనే పార్టీ నిర్వహణ ఉంటుంది. నేను ఏం చెబుతానో అదే ఆచరిస్తాను. నేను నా వ్యక్తిగత ప్రయోజనం అనేది చూసుకోలేదు.. చూసుకోను`` అని ప‌వ‌న్ అన్న‌ట్టు తెలిసింది. నిజానికి కులాల విష‌యంలో ప‌వ‌న్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆస‌క్తిగా మారాయి. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న హోదా స‌హా అటు టీడీపీ - ఇటు వైసీపీల విష‌యంలోనూ మార్చిన మాట‌లతో పోల్చుకుంటే ఇది కూడా ఒక‌టని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాబోయే రోజుల్లో మ‌రెన్ని మాట‌లు మారుతాయో చూడాలి.




Tags:    

Similar News