నేను చాలా శాంతస్వరూపుడ్ని. అంతేనా.. చాలా గౌరవ.. మర్యాదలున్న వాడ్ని. కోపాన్ని ప్రదర్శించటం.. ఆగ్రహంతో ఊగిపోవటం లాంటివి నా మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా కనిపించవు సుమా అన్నట్లు నీతి బోధనలు చేయటం షురూ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నిజాయితీగా మాట్లాడతారన్న పేరున్న పవన్.. తన తీరుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా తన తెలంగాణ టూర్లో మీడియాతో మాట్లాడిన పవన్.. తనకు గొడవలు పెట్టుకోవటం ఇష్టం లేదన్నారు. తనను పే..ద్ద గండం నుంచి తప్పించిన కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన పవన్ కు.. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యుల పేరుతో ప్రత్యేక పూజలు చేసిన పవన్.. ఆలయ అభివృద్ధికి రూ.11లక్షల విరాళాన్ని ప్రకటించారు.
కేసీఆర్ కున్న సవాళ్ల మధ్య రాష్ట్రాన్ని చాలా బలంగా తీసుకెళుతున్నట్లుగా చెప్పారు. తెలంగాణపై తనకు మమకారం.. గౌరవం ఉన్నాయని.. గొడవలు పెట్టుకోవటం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ముద్దు ముద్దుగా పవన్ మాట్లాడిన మాటలు విన్నంతనే.. పవన్ ఎంత మంచి రాజకీయ నాయకుడు అన్న భావన కలుగుతుంది. మరి.. ఇదే పవన్ కల్యాణ్ కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ నేతల్ని పంచెలూడదీస్తానన్న వ్యాఖ్య చేసి సంచలనం సృష్టించారు. తీవ్ర కలకలాన్ని రేపిన ఆ వ్యాఖ్యను ఇప్పటికి గుర్తు చేస్తుంటారు.
మరింత టెంపర్ ఉన్న పవన్.. సార్వత్రిక ఎన్నికల వేళలో.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయటం మర్చిపోకూడదు. తాటతీస్తానన్న మాటతో గులాబీ శ్రేణుల ఆగ్రహాన్ని చూసిన పవన్..ఈ రోజు తాను చాలా మర్యాదగా.. గౌరవంగా ఉంటానని చెబుతున్న మాటలు చూస్తే.. కాలానికి తగ్గట్లు తన వ్యాఖ్యల తీరును పవన్ మార్చుకుంటున్నారని చెప్పక తప్పదు. నీతులు చెప్పటం తప్పు కాదు కానీ.. దానికి ముందు చేసిన వ్యాఖ్యలపైనా వివరణ ఇచ్చి క్లారిఫై చేస్తే గొడవ ఉండదు. అందుకు భిన్నంగా గతంలో తాను చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వని పవన్.. ఈ రోజు మాత్రం అందుకు భిన్నంగా తాను గొడవలు పెట్టుకునే వ్యక్తిని కానని చెప్పటం చూస్తే.. పవన్ డబుల్ స్టాండ్ ఇట్టే అర్థం కాక మానదు.