రూటు మార్చిన జనసేనాని..రెచ్చిపోయిన అభిమానులు

Update: 2020-12-29 14:30 GMT
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ రూటు మార్చారు. మీడియా సమావేశం అయినా, బహిరంగ సభ అయినా పవన్ మాట్లాడేది ఓ పట్టాన అర్ధంకాదు. ఒక అంశంపై మాట్లాడుతునే సంబంధం లేని మరో అంశంలోకి వెళిపోతారు. ఒకేసారి మూడు, నాలుగు అంశాలు మాట్లాడేయటం పవన్ కు బాగా అలవాటు. దాంతో మాట్లాడే పవన్ కు ఎలాగున్నా వినేవాళ్ళకు మాత్రం చాలా విచిత్రంగా, విసుగ్గా ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపణ అయ్యింది.

అయితే తన సహజ స్వభావానికి భిన్నంగా గుడివాడ రోడ్డుషోలో పవన్ మాట్లాడటంతో అందరు ఆశ్చర్యపోయారు. సోమవారం మధ్యాహ్నం గుడివాడలో పవన్ రోడ్డుషోలో పాల్గొన్నారు. ఈమధ్య నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలనే డిమాండ్ తో పవన్ ఆధ్వర్యంలో నేతలు మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

అంతకుముందు గుడివాడ రోడ్డుషోలో పవన్ మాట్లాడుతు ప్రభుత్వంపైన అనేక విమర్శలు, ఆరోపణలు చేశారు. సరే పవన్ చేసిన ఆరోపణలు, విమర్శల్లో నిజమెంత అన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే మాట్లాడదలచుకున్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు. ఇదే సమయంలో తన అభిమానులను ఎంటర్ టైన్ చేసే  విధంగా పవన్ మాట్లాడటం ఆశ్చర్యమేసింది. గుడివాడ కాబట్టి నేరుగా కాకుండా పరోక్షంగా మంత్రి కొడాలి నాని పై చెణుకులు విసిరారు.

ఉయ్యూరు, గుడివాడ ప్రాంతంలో తాను చూసినంతలో ఎక్కడ కూడా రోడ్లు సరిగా లేవన్నారు. నష్టపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం అందించలేదన్నారు. రైతులకు పరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడించటానికి కూడా భయపడేది లేదన్నారు. సినిమాలు చేసుకోకుండా తనకు రాజకీయాలు ఎందుకని అడిగే వాళ్ళందరు తమ వ్యాపారాలను కట్టిపెట్టేస్తే తాను కూడా సినిమాలకు స్వస్తి చెబుతానన్నారు. పైగా వైసీపీ నేతలేమైనా దేశసేవ చేస్తున్నారా ? అంటూ సూటిగా నిలదీశారు.

అధికారపార్టీ నేతలు ఇసుక, మద్యం, పేకాటక్లబ్బులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, కాంట్రాక్టులు చేసుకోవటంలో తప్పు లేనపుడు తాను సినిమాల్లో నటించటంలో ఏమి తప్పుందంటు నిలదీశారు. మొత్తం మీద పవన్ ప్రసంగం మొత్తం గతానికి భిన్నంగా జరగిందనే చెప్పాలి. మామూలుగా అయితే పవన్ ఎక్కడ మాట్లాడినా మైకు ముందు ఆవేశంగా ఊగిపోతు, ఏమి మాట్లాడుతున్నాడో కూడా అర్ధంకాని రీతిలో ఒకటే అరుపులు అరిచే విషయం అందరు చూసిందే. అయితే గుడివాడలో మాత్రం పవన్ ఎక్కడా ఆవేశానికి లోనుకాకుండా కాస్త సెటైరికల్ గా కూడా కూల్ గా మాట్లాడటంలో పరిణతి కనిపించింది.
Tags:    

Similar News