చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చిపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఏకిపారేశారు. బాబు చేసేది గోరంత సాయం అయితే.. చెప్పుకునేది కొండంత అంటూ మండిపడ్డారు. ఇటీవల తిత్లీ తుఫానుతో ఉత్తరాంధ్ర ఎంతటి విపత్తును ఎదుర్కుందో తెలిసిందే.. ప్రభుత్వ వైఫల్యం ఇందులో కొట్టొచ్చినట్టు కనిపించింది. దీనిపై అప్పట్లోనే గళమెత్తిన పవన్ కళ్యాన్ తాజాగా ట్విట్టర్ ద్వారా ఒక ఫొటో షేర్ చేసి ఎండగట్టారు. తిత్లీ తుఫాన్ సహాయాన్ని కూడా ప్రచారం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.
టీడీపీ ప్రభుత్వ తీరును చూస్తే అతి ప్రచారం కొంప ముందుతుందనే అబ్రహం లింకన్ మాటలను గుర్తూ చేస్తూ పవన్ ట్వీట్ చేశారు. తిత్లీ బాధితులకు ప్రభుత్వం చేసింది గింజంత అయితే.. ప్రచారం మాత్రం ఎవరెస్ట్ రేంజ్ లో ఉందని పవన్ మండిపడ్డారు.
ఇక మరో ట్వీట్ లో జనసేన నాయకులు, కార్యకర్తలు కార్తీకమాసం వనభోజనాల పేరిట తన పేరును.. జనసేన పార్టీ పేరును వాడుకోవద్దని.. వ్యక్తిగతంగా ఎవరికి వారు పండుగను చేసుకోవాలని సూచించాడు. ఈ సందర్భంగా తెలుగు ఆడపడుచులకు, అక్కాచెల్లెళ్లకు, తల్లులకు కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేశాడు.