తన తల్లిని పనిగట్టుకొని కొన్ని మీడియా చానెళ్లు దూషించాయని, వారిపై సుదీర్ఘమైన న్యాయపోరాటానికి సిద్ధమని జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ నిన్న సంచలన ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. తన తల్లిని తీవ్రంగా అవమానించినందుకు ఆవేదన చెందిన పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కు శ్రీనిరాజు లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఏబీఎన్ చానెల్ ఓపీ వ్యాన్ పై నిన్న పవన్ ఫ్యాన్స్ దాడి చేసిన ఘటనపై జర్నలిస్టు సంఘాలు మండిపడిన సంగతి తెలిసిందే. టీవీ5 - టీవీ9 - ఏబీఎన్ టీవీ ఛానళ్ళను బహిష్కరించాలన్న పవన్ తీరుపై జర్నలిస్టులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనను చూసేందుకు ఇంటిదగ్గరకు వచ్చిన ఫ్యాన్స్ తో మాట్లాడేందుకు పవన్ బయటకు వచ్చారు. ఆ సందర్భంగా మీడియాపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జర్నలిస్టుల మీద కోపం లేదని, సమాజంలో మంచి, చెడు రెండూ ఉంటాయని...వాటిని చెప్పాలని పవన్ అన్నారు.
తనకు జర్నలిస్టులంటే కోపం లేదని పవన్ స్పష్టం చేశారు. ``ఒక ఆడపిల్ల తన సమస్యను చెప్పుకునేందుకు నడిరోడ్డు మీద బట్టలు ఊడదీసుకోవడానికి వచ్చిందని ..అపుడు ఎవవైనా ఏం చేస్తారు....ఆ అమ్మాయికి చొక్కా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు...ఆ అమ్మాయి సమస్య చెప్పుకుంది....ప్రతి దానికి పవన్ కల్యాణ్ ఎలా బాధ్యుడవుతాడు`` అని అభిమానులనుద్దేశించి పవన్ అన్నారు. రవిప్రకాష్ తో గానీ వేరెవరితో గానీ తనకు వ్యక్తిగతంగా సమస్యలు లేవని, పదే పదే తనను టార్గెట్ చేయడం బాధ కలిగించిందని పవన్ అన్నారు. అందుకే, కొన్ని మీడియా చానెళ్లపై చాలా సుదీర్ఘమైన పోరాటం చేయబోతున్నానని, తాను లీగల్ గా వెళ్లబోతున్నానని అన్నారు. ఈ వ్యవహారంలో ఫ్యాన్స్ ఎవరూ కోపాలకు పోవద్దని, ఎవరిపై ఎటువంటి దాడులకు , దూషణలకు పాల్పడవద్దని, అందరూ సంయమనం పాటించాలని తన అభిమానులకు పవన్ పిలుపునిచ్చారు. మొత్తానికి తాను మీడియా - జర్నలిస్టులకు వ్యతిరేకిని కాదని, పని గట్టుకొని తనను టార్గెట్ చేసిన వారిని మాత్రమే పవన్ లీగల్ గా ఎదుర్కొనడానికి ప్రిపేర్డ్ గా వచ్చినట్లు తెలుస్తోంది.
Watch Here : https://www.youtube.com/watch?v=H19zmsSfLQE