చెప్పడానికే శ్రీరంగ నీతులు.. చేసే పనులు మాత్రం ఛండాలం అన్నట్టుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. నోరు విప్పితే నా అంత ఉత్తముడు లేడని చెబుతాడు. ఎదుటి వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడను అంటారు. మీరు కూడా నా వ్యక్తిగత జీవితాల గురించి అడక్కండి - ఏమీ అనకండి అంటాడు. కానీ... తాను గీసిన గీతను తానే దాటుతుంటాడు.
అందరినీ గౌరవించాలి. గౌరవంగా చూడాలి అనే పవన్ కళ్యాణ్ మొన్నామధ్య మగతనమూ అదీ ఇదీ అంటూ జగన్ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆయన ఇంకో గొప్పమాట సెలవిచ్చారు. *రాహుల్ ది బ్రహ్మచర్యం అంటున్నారు.. లోలోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు* అని పవన్ అన్నారు.
ఇట్లా ఉంటుంది పవన్ తీరు . ఆయన వ్యక్తిత్వం గురించి రేణు దేశాయ్ మీడియాతో బహిరంగంగా చాలా వెల్లడించారు. ఆయన రెండు పెళ్లిళ్లకు కారణాలు కానీ... వ్యక్తిగతం గురించి మాట్లాడొద్దు అంటారు. పోనీ ఇతరుల విషయంలో తానూ అలాగే ఉంటాడా అంటే అదీ ఉండరు.
ప్రజా సమస్యలపై మాట్లాడే మనిషి ప్రజా సమస్యల పైనే మాట్లాడాలి. మోసం చేసిన మోడీని ఒక్క మాట అనరు.. ఎవరూ పట్టించుకోని రాహుల్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరినైనా అనడానికి పవన్ కు హక్కుంది. కానీ మాట్లాడాల్సిన విషయాలు కాకుండా ఆయన దృష్టంతా ఇతర విషయాలపై ఉంటోంది.
అయినా... రాష్ట్రంలో అన్ని సమస్యలు ఉంటే పవన్‌కు ఈ టాపిక్ లే దొరుకుతాయా అంటూ సోషల్ మీడియాలో పవన్ ను ట్రోల్ చేస్తున్నారు. రూల్స్ ఫర్ అదర్స్ - నాట్ ఫర్ పవన్ అని జనం సరిపెట్టుకోవాలని పవన్ అనుకుంటున్నాడేమో.