ప‌వ‌న్ మ‌రియు ప‌వ‌ర్ : డీజీపీ బ‌దిలీ వెనుక కార‌ణాలివే?

Update: 2022-02-16 04:17 GMT
ఉన్న‌ట్టుండి డీజీపీ బ‌దిలీ అయిపోయారు.ఆ విధంగా బ‌దిలీ అయిపోయి కొత్త వివాదానికి తావిచ్చారు.అస‌లు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా చోటు చేసుకున్న ఈ ప‌రిణామం రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాత్మ‌కం అవుతోంది.దీని పై ప‌లు వివాదాలు,అనుమానాలూ కూడా వ్య‌క్తం  అవుతున్నాయి.జ‌న‌సేన కూడా త‌న‌దైన వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.

ఇటీవ‌ల పీఆర్సీ సాధ‌న స‌మితి నేతృత్వాన  జ‌రిగిన చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డం, ఆ విష‌య‌మై ఇంటెలిజెన్స్ వైఫ‌ల్యం కొట్టొచ్చిన రీతిన క‌నిపించ‌డంతోనే సీఎం జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ ఆరోపిస్తున్నారు.

మ‌రోవైపు కొత్త డీజీపీ రాక నేప‌థ్యంలో మ‌రో వివాదం కూడా రేగుతోంది. క‌సిరెడ్డి వెంక‌ట రాజేంద్ర నాథ్ రెడ్డి కి శుభాకాంక్ష‌లు చెబుతూ రెడ్డి సామాజిక వ‌ర్గ పెద్ద‌లంతా సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నారు.

గ‌తంలో ఇదే విధంగా ఎంద‌రెంద‌రో ప‌రిపాల‌న సంబంధ నిర్ణ‌యాల్లో భాగంగానే బ‌దిలీ అయి ఉంటారు.ఉండాలి కూడా! కానీ ఇక్క‌డ రాజ‌కీయ కార‌ణంగానే ఆయ‌న బ‌దిలీ అయ్యార‌ని జ‌న‌సేన త‌ర‌ఫున ప‌వ‌న్ ఆరోపిస్తుంటే,మ‌రోవైపు కొంద‌రు రెడ్డి సామాజిక వ‌ర్గ ప్ర‌ముఖులు డీజీపీ మావాడే అంటూ హ‌డావుడి చేస్తున్నారు.

ఏ విధంగా చూసుకున్నా ఇటువంటి ప‌రిణామాలు హ‌ర్షించ‌ద‌గ్గ‌వి కావు అని కూడా జ‌న‌సేన అంటోంది.ఇటుంటి పోస్ట‌ర్ల‌ను అప్ చేయ‌డం ద్వారా వైసీపీ త‌న గౌర‌వాన్ని కోల్పోతుందని, త‌న ప‌రువు తానే తీసుకుంటుంద‌ని అభిప్రాయప‌డుతోంది.ఓ అధికారి అంటే కులం,మతం అన్న అంటింపు లేకుండా, ప‌ట్టింపు లేకుండా రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల వారినీ, కులాల వారినీ స‌మానంగా చూడాలి.

ఆ విధంగా స‌మానత్వ భావం పెంపొందించాలి.కానీ ఇక్క‌డ మాత్రం కొత్త డీజీపీ రాక నేప‌థ్యంలో కుల వివాదాలు రేపుతున్నారు.గ‌తంలో కూడా పోలీసు శాఖ‌లో ప‌దోన్న‌తుల విష‌య‌మై క‌మ్మ సామాజిక‌వ‌ర్గం వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చార‌ని చంద్ర‌బాబుపై వైసీపీ ఎంత‌గానో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇప్పుడు అదే వైసీపీ త‌న పంథా మార్చి ఈ విధంగా న‌డుచుకోవ‌డం త‌గ‌ద‌ని కూడా చెబుతున్నారు జ‌న‌సేన అభిమానులు.
Tags:    

Similar News