జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హత్య చేయాలనుకున్నాడా...? ఆయన ఎవరిని చంపాలనుకున్నాడు.. ఎందుకు చంపాలనుకున్నాడు. . ? అభిమానులు - ప్రజలు షాక్ తినే ఈ ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పారు. ఆయన నోటివెంటే ఆ గుట్టు బయటకొచ్చింది. అయితే.. ఇప్పుడు కాదు - ఆయన చిన్నతనంలో జరిగిన ఘటన ఇది. అనంతపురం జిల్లా గుత్తిలో విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పవన్ కల్యాణ్ ఈ సంగతి వెల్లడించారు.
విద్యార్థులతో సమావేశమైన ఆయన - విద్యార్థినుల రక్షణ - భద్రత గురించి మాట్లాడుతూ - తన చిన్నప్పుడు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాను చిన్నవాడిగా ఉన్న సమయంలో తన అక్కను కొందరు ఏడిపించారని.. అప్పుడు వాళ్లను చంపేద్దామని అనుకున్నానని చెప్పారు. ఆడవాళ్లు బయటకు వెళితే, ఇలాంటి వేధింపులు తప్పవా? ఈ పరిస్థితి మారాలన్న ఆలోచన అప్పటి నుంచే నా మనసులో ఉండిపోయింది అని ఆయన చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే - విద్యార్థినుల ఆత్మగౌరవాన్ని అవమానించిన వారికి తీవ్ర శిక్షలు ఉంటాయని... అలా వేధింపులకు పాల్పడినవారిని దండించిన వారిపై ఎలాంటి కేసులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అమ్మాయిలు ఇంట్లో అయినా, వీధిలో అయినా ఒంటరిగా ఉండేందుకు - నడిచి వెళ్లేందుకు వీలు కల్పించే - భద్రత అందించే సమాజం రావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.
ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగితే తప్పా అలాంటి చట్టం ఒకటి తేవాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాలేదని ఆయన ఆరోపించారు. అమ్మాయిల వెంట పడేవారిని చెప్పుతో కొట్టాలని సూచించారు. దేశం బాగుపడాలంటే ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఒకరిని ఏడిపిస్తే పది మంది కలిసికట్టుగా వెళ్లి తన్నాలని చెప్పారు. గాంధీయిజం అంటే తనకు ఇష్టమేనని, కానీ అన్ని సమస్యలకు అది పరిష్కారం కాదని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/