రేపే పవన్ రైతు సౌభాగ్య దీక్ష .. రైతుల కోసమేనా ?

Update: 2019-12-11 04:59 GMT
దేశానికీ వెన్నుముక అయిన రైతుల కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 12 న దీక్ష చేయడానికి సిద్ధమైనా సంగతి తెలిసిందే. కాకినాడలో పవన్ కళ్యాణ్ చేయబోయే ఈ దీక్షకు జనసేన పార్టీ ‘రైతు సౌభాగ్య దీక్ష’ గా నామకరణం చేసింది. దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్ ఆవిష్కరించారు. భుత్వం రైతుల సమస్యల్ని పరిష్కరించాలనే డిమాండ్‌తో పవన్ ఈ దీక్షకు సిద్ధమయ్యారు. వరి పంట వేయడానికే రైతులు భయ పడేలా ప్రభుత్వ విధానాలుంటున్నాయని.. గిట్టుబాటు ధర లేక, ఖర్చులు రాబట్టుకో లేక నానా కష్టాలు పడుతున్నారు అంటూ జనసేన పార్టీ చెప్తుంది.

కొంతమంది ధాన్యం రైతులు తనను కలిసి వారి అవస్థల గురించి చెప్పారుని.. పరిస్థితి స్వయంగా తెలుసుకుందామని మండపేట, పరిసర ప్రాంతాలలో పర్యటించి రైతులతో స్వయంగా మాట్లాడాను అని తెలిపారు. రైతులు రక్తమాంసాలు ధారపోసి పండించే పంటలకు రసీదు ఇవ్వడం లేదని జగన్ పై మండి పడ్డారు. వేలకోట్ల ఆస్తులు, సొంత ఇళ్ళు ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వ నిధులకోసం ఆశపడుతున్నారని దుయ్యబట్టారు. రైతులకు భరోసా ఇవ్వండని, రైతులను బ్రతికించండని పవన్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. పాదయాత్రలు చేసి ముద్దులు పెడితే రైతుల కడుపు నిండదని పవన్ సీఎం జగన్ ని విమర్శించారు.

వ్యవసాయాన్ని దండగలా కాకుండా పండుగలా చేయాలని.. అటువంటి రోజు కోసమే 12న దీక్ష తలపెట్టామని.. ప్రతీ జన సైనికుడు రైతుకు సంఘీభావం తెలపాలి అన్నారు. వారి కన్నీటిని తుడవడానికి ప్రయత్నించాలి అన్ననారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల సమస్యను బలంగా తెలియజేయడానికే ఈ దీక్షను తల పెట్టినట్లు వెల్లడించారు పవన్. రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నానని.. వారి కష్టాలు, ఆవేదనను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లేందుకే జనసేన రైతు సౌభాగ్య దీక్ష చేపడుతున్నానని స్పష్టం చేశారు. పవన్ రైతుల కోసం దీక్ష చేస్తున్న కూడా .. జగన్ టార్గెట్ గా పవన్ ఈ దీక్ష చేయబోతున్నట్టు తెలుస్తుంది.


Tags:    

Similar News