అగ్రిగోల్డు బాధితులతో మాట్లాడడానికి విజయవాడ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ తాను ఎందుకొచ్చానో.. ఏం చేయదలచుకున్నానో ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు. ప్రభుత్వం ఏం చేయాలో.. ప్రభుత్వం నుంచి తాను, బాధితులు ఏం కోరుకుంటున్నారో కూడా చెప్పలేకపోయారు. పైగా ఇది ఇప్పుడిప్పుడే తేలే విషయం కాదని.. తేలేవరకు వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేమన్నట్లుగా మాట్లాడారు. అంతేకాదు... ఈ కేసుపై చర్యల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమేమీ లేదని క్లీన్ చిట్ కూడా ఇచ్చారు.
అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పెద్ద చిక్కుముడి అని.. డెడ్ లైన్లు విధించి సమస్యను పరిష్కరించుకోవడం కుదరదని పవన్ తెలిపారు. బాధితులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రయోజనం ఉండదన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం పోరాడదామన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం ప్రకటించాలన్నారు. దీనిపై శ్వేత పత్రం విడుదల చేస్తుందో లేదో తెలియదని అన్నారు.
అగ్రీగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని భావించాల్సిన అవసరం లేదని, అయితే, డబ్బు తిరిగి చెల్లింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని మాత్రం తాను చెప్పగలనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కేసు నిదానంగా సాగుతుండటం, అగ్రీగోల్డ్ ఆస్తుల వేలం ముందడుగు వేయకపోవడానికి కారణాలు తనకు తెలియవని, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని, ఈ విషయంలో న్యాయవాదుల అభిప్రాయాలను తీసుకుంటానని చెప్పారు. బాధితులతో మాట్లాడిన తరువాత, ప్రభుత్వంతో ఈ విషయంలో చర్చించాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయించుకుంటానని అన్నారు. అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగా ఉన్న వేళ, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయని పవన్ అభిప్రాయపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/