వామ‌ప‌క్షాల విష‌యంలో ప‌వ‌న్ దారెటు?

Update: 2018-08-26 10:23 GMT
జ‌న‌సేన అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు రాజ‌కీయాలు చేయ‌డం తెలియ‌దు....ఆయ‌నో పార్ట్ టైం పొలిటిషియ‌న్ అని విమ‌ర్శ‌లు ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించేవి. అయితే, ఇక‌పై ప‌వ‌న్ ను ప‌రిపూర్ణ రాజ‌కీయ‌వేత్త అని వారు గుర్తించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అనిపిస్తోంది. ఎందుకంటే , కొద్ది రోజుల క్రితం వామ‌ప‌క్ష నేత‌ల‌తో రాసుకుపూసుకు తిరిగిన ప‌వ‌న్....ఇపుడు సాక్ష్యాత్తూ సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌కు అపాయింట్ ఇవ్వ‌ని రేంజ్ కు వెళ్లారు. ప్ర‌స్తుతం వామ‌ప‌క్ష నేత‌ల‌ను కూర‌లో క‌రివేపాకులా తీసివేసిన ప‌వ‌న్ ....ఫుల్ టైం పొలిటిషియ‌న్ అయిన‌ట్లేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. క‌ర్ణాక‌ట ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ...సీఎం ప‌ద స్మ‌ర‌ణ చేస్తోన్న ప‌వ‌న్...తాజాగా ఈ అపాయింట్ మెంట్ వ్య‌వ‌హారంతో ప‌వ‌న్...రాజ‌కీయ నాయ‌కుడిగా పూర్తిగా ప‌రిణ‌తి చెందిన‌ట్లేన‌ని అంటున్నారు.

తాను చ‌దువుకునే స‌మ‌యంనుంచే వామ‌ప‌క్ష భావ‌జాలం ప‌ట్ల ఆక‌ర్షితుడ‌న‌య్యాన‌ని, అస‌లు ఓ ద‌శ‌లో మావోయిస్టుగా మార‌దామ‌ని అనుకున్నాన‌ని ప‌వ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌లు ల‌క్ష్యంగా వామ‌ప‌క్షాల‌తో జ‌త క‌ట్టారు. ఎటూ జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో బ‌ల‌మైన క్యాడ‌ర్ లేరు కాబ‌ట్టి....వామ‌ప‌క్ష కార్య‌క‌ర్తల‌తో  ఆ లోటును భ‌ర్తీ చేద్దామ‌నుకున్నారు. అయితే, క‌ర్ణాట‌క‌లో కుమార‌స్వామి సీఎం కాగానే...ఏపీలో కూడా తాను సోలోగా కింగ్ మేక‌ర్ కావాల‌ని ప‌వ‌న్ ఆశ‌ప‌డ్డారు. ఆ క్ర‌మంలోనే తాము స్వ‌యంగా  175 స్థానాల్లోనూ బ‌రిలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత వామపక్షాలను ప‌వ‌న్ ప‌క్క‌న‌ప‌డేశారు. గ‌తంలో వామ‌ప‌క్ష నేత‌ల‌తో భేటీలు - సమావేశాలు  పాద‌యాత్ర‌లు నిర్వహించిన పవన్....ఇపుడు క‌నీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌డం లేదు. దీంతో, విజ‌య‌వాడ‌లో స‌భ‌కు ప‌వ‌న్ ను ఆహ్వానించ‌డానికి వ‌చ్చాన‌ని, ఆయ‌న‌కు విష‌యం విన్న‌వించాల‌ని జ‌న‌సేన ప్ర‌తినిధుల‌కు రామకృష్ణ చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. జ‌న‌సేన‌తో క‌లిసి వామపక్షాలు మహా కూటమిగా బ‌రిలోకి దిగుతాయ‌ని వారు ప్ర‌క‌టించినా...జనసేనాని స్పందించ‌లేదు. మ‌రి, ఇపుడు వామ‌ప‌క్షాల‌పై ప‌వ‌న్ దారెట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News