మోడీ కేబినెట్ లోకి పవన్ కళ్యాణ్: నాదెండ్ల క్లారిటీ

Update: 2021-07-06 09:30 GMT
రాబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో జనసేన అధినేత, బీజేపీ మిత్రపక్షం నేత అయిన పవన్ కళ్యాణ్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వబోతున్నారని పలు మీడియా సంస్థల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ వర్గాల నుంచి కూడా  ఇదే ప్రచారం సాగుతోంది. ఈ వారంలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతోందని.. పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై జనసేనలో పవన్ తర్వాత నంబర్ 2 అయిన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తాజాగా స్పందించారు. ‘పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చారు.  ప్రజాశ్రేయస్సు కోసమే పవన్ పోరాడుతున్నారు. కేబినెట్ మంత్రి పదవులు లాంటి తాత్కాలిక ప్రయోజనాలు ఆయనను ఉత్తేజ పరచవు.. పవన్ ను కేబినెట్ లోకి తీసుకుంటున్నారన్న వార్తలు వట్టి పుకార్లు మాత్రమే.. ఇవన్నీ నిరాధారమైనవి’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

ఇక మోడీ కేబినెట్ లోకి పవన్ కళ్యాణ్ ను తీసుకుంటున్నారన్న ఊహాగానాలకు తెరపడినట్టైంది. కేంద్రం నుంచి కూడా ఇప్పటిదాకా ఎలాంటి పిలుపు పవన్ కు రాలేదని చెబుతున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పొలిట్ బ్యూరో సభ్యులతో నేడు, రేపు ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడానికి నేతలను రప్పించారు. అలాగే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగ క్యాలెండర్ గురించి పవన్ మాట్లాడుతారు. దీని మీద పోరాడడానికి జనసేన డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.
Tags:    

Similar News