ఏం చేసితిరి ప‌వ‌న్ క‌ల్యాణ్..టికెట్ కోసం అప్లికేష‌న్!

Update: 2019-02-13 05:09 GMT
రోటీన్ గా చేస్తే అందులో కిక్ ఏముంటుంది?  కాస్త డిఫ‌రెంట్ గా చేస్తే జ‌రిగే ప్ర‌చారంతో తాము చెప్పాల‌నుకుంటున్న విష‌యాల్ని చెప్పేసిన‌ట్లు అవుతుంది. ఇవాల్టి రోజున రాజ‌కీయ పార్టీల్లో విలువ‌లు అన్న‌వి లేవ‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై భారీ చ‌ర్చ జ‌రుగుతోంది. ఇలాంటివేళ‌.. త‌మ పార్టీలో ఇలాంటివి ట‌న్నుల ట‌న్నుల లెక్క‌న ఉంటాయ‌న్న విష‌యాన్ని చెప్ప‌టం ఎలా? అన్న సందేహానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

అధినేత అన్న త‌ర్వాత‌.. న‌చ్చిన చోట ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే వీలుంటుంది. కాద‌నే వారే ఉండ‌రు. ఆ మాట‌కు వ‌స్తే.. ఫ‌లానా చోటు నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్నాను అన్నంత‌నే.. ఉరుకులు ప‌రుగులు పెడుతూ నేత‌లు వ‌చ్చి.. సార్ అంత‌క‌న్నా అదృష్ట‌మా అన‌టం ఖాయం. కానీ.. రోటీన్ గా సాగే వ్య‌వ‌హారాన్ని అలానే చేస్తే.. ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎందుకు అవుతారు? అందుకే.. త‌మ పార్టీ నిబ‌ద్ధ‌త‌ను జ‌నాల‌కు చెప్పాల‌నుకున్నారు.

పార్టీ అధినేత మొద‌లు.. కార్య‌క‌ర్త వ‌ర‌కూ అంతా ఒక్క‌టే.. అంద‌రికి ఒక‌టే రూల్స్ అన్న విష‌యాన్ని చెప్పాల‌నుకున్న ప‌వ‌న్ తాజాగా చేసిన ప‌ని ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌న్న ఆస‌క్తి ఉంద‌న్న విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఒక అప్లికేష‌న్ ను బెజ‌వాడ‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలోని ఎన్నిక‌ల క‌మిటీకి అంద‌జేశారు.

అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో పార్టీ అనుస‌రించాల్సిన విధానం.. వ‌డ‌బోత చేసే ప‌ద్ద‌తిపై భారీ చ‌ర్చ జ‌రిగింది. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ అనుభ‌వాల దృష్ట్యా.. టికెట్ల పంపిణీ ఇష్యూలో ఎలాంటి ర‌చ్చ జ‌ర‌గ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ప‌వ‌న్‌.. అందుకు త‌గ్గ మార్గ‌ద‌ర్శ‌కాల్ని త‌యారు చేయించారు. వీటికి పార్టీ అధినేత‌గా తాను సైతం మిన‌హాయింపు కాద‌న్న విష‌యాన్ని తెలియ‌జేసేందుకు ఆయ‌న కూడా స్వ‌యంగా అప్లికేష‌న్ పెట్టుకున్నారు.

ఎవ‌రికి ఎలాంటి మిన‌హాయింపులు ఉండ‌వ‌న్న విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. ఎన్నిక‌ల్లో పోటీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. త‌న అప్లికేష‌న్ ను పార్టీ ఎన్నిక‌ల క‌మిటీకి అంద‌జేశారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి ఆస‌క్తి చూపే అభ్య‌ర్థులు.. వారి బ‌యోడేటాల‌ను మాదాసు గంగాధ‌రం ఆధ్వ‌ర్యంలోని వ‌డ‌పోత క‌మిటీకి ప‌వ‌న్ త‌న ద‌రఖాస్తును అందించారు. అభ్య‌ర్థులు ప‌క్క దారి ప‌ట్ట‌కుండా ఉండేందుకు వీలుగా పార్టీ ఏర్పాటు చేసిన మాదాసు క‌మిటికి త‌ప్పించి వేరెవ‌రికి అప్లికేష‌న్లు ఇవ్వ‌కూడ‌ద‌ని డిసైడ్ చేశారు. ఫార్సుగా అనిపించే ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్లికేష‌న్ ఎపిసోడ్ కాస్తంత కామెడీగా మారింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. ప‌వ‌న్ ఫాలో అయిన రూల్స్ ను.. జ‌న‌సేన నేత‌లు.. టికెట్లు ఆశించే వారెంత‌వ‌ర‌కూ ఫాలో అవుతారో చూడాలి.
Tags:    

Similar News