ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల సమయంలో తాను చంద్రబాబుకు భేషరుతు మద్దతు ఇచ్చానని.. అనుభవం ఉన్న పాలకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించానని.. కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు.
తాను వందల కోట్ల ఆదాయాన్ని వదిలేసి టీడీపీ వెనుక నిలిచానని.. కానీ ఇసుక మాఫియాను కూడా చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోయారని చెప్పారు. పదవుల కోసం పాకులాడే మసన్తత్వం తనకు లేదన్నారు.చంద్రబాబుకు మాదిరి తనకు మద్దతు ఇచ్చే పత్రికలు.. ఛానల్స్ లేవన్న పవన్.. తన దగ్గర కోట్లు లేవని.. గూండాలు అసలే లేరన్నారు.
తనను తిరిగి మరోసారి ముఖ్యమంత్రిని చేస్తే ఏపీకి అభివృద్ది చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని.. బాబుకు అండగా నిలిచినా నదీ తీరాల్లో ఇసుక మాఫియాతో పెట్రేగిపోయిన వైనంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా కనీస సదుపాయాలు లేవని.. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు.
ప్రజాభిమానాన్ని అడ్డుకోవటం ఎవరి తరం కాదన్న ఆయన.. కష్టాలు ఎదురవుతాయని.. దెబ్బలు తగులుతాయని తెలిసే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు
జగన్ లక్ష కోట్లు తిన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పుస్తకం ముద్రించారని.. ఆ డబ్బంతా ప్రజలది కాదా? అని ప్రశ్నించారు. ధర్మ పోరాట దీక్షల పేరుతో రూ.2 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నారని.. అదే సమయంలో సమస్యలతో ఉన్న ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
మాదిగల్లో తాను పెద్ద మాదిగనని చెప్పుకునే చంద్రబాబు.. తన పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే దళితులపై చేస్తున్న దాడుల గురించి పట్టించుకోరా? అని నిలదీశారు. ఓటు అనే ఆయుధంతో స్వార్థ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని పవన్ పిలుపునిచ్చారు. తాను మతాలు.. కులాల్ని నమ్ముకొని పార్టీ పెట్టలేదని.. తనకు తెలిసి రెండు కులాలే ఉంటాయని.. ఒకటి.. దోపిడీకి గురయ్యే వర్గమైతే.. రెండోది దోపిడీ చేసే వర్గంగా ఆయన అభివర్ణించారు. బాబుపై పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.