ప‌వ‌న్ ట్వీట్ల వ‌ర్షం....ఆ ఇద్ద‌రిపై నిప్పులు

Update: 2017-01-26 11:05 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా అంశంలో విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌రుగ‌తున్న శాంతియుత నిర‌స‌న‌ను పోలీసులు అణిచివేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఇటు రాష్ట్ర పోలీసుల తీరును, తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి, ఆ పార్టీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు తీరును ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్పుప‌ట్టారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న వారిని కేంద్ర మంత్రి సుజ‌నా పందుల పోటీలు ఆడుకోవాల‌ని ఉచిత స‌ల‌హా ఇవ్వ‌డంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి కామెంట్లు చేసే వారిని ఏపీ ప్ర‌జ‌లు - విద్యార్థులు గుర్తుంచుకోవాల‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అదే స‌మ‌యంలో ఇటీవ‌లే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల తీరును, ఆ నిర్మాణ సంస్థ అధిప‌తి అయిన ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావును టార్గెట్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు ఆయ‌న్ను ముగ్గులోకి దించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అంతటికి ప్రాణాధార‌మైన ప్ర‌త్యేక హోదా ప్రాజెక్టు కాంట్రాక్టు రూపంలో టాక‌ట్టుపెట్ట‌వ‌ద్ద‌ని కోరారు. ఆర్కే బీచ్ లో కొవ్వుత్తుల ర్యాలీ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాక‌పోయిన‌ప్ప‌టికీ వ‌రుస‌గా ప‌లు ట్వీట్లు పెట్టిన ప‌వ‌న్ త‌న మ‌ద్ద‌తును అందించారు. అయితే ఈ ట్వీట్ల‌న్నింటిలోనూ త‌న అభిప్రాయాలను ఒకింత ఘాటుగానే వెల్ల‌డించారు.

ప‌వ‌న్ ఈ రోజు చేసిన‌ ట్వీట్లు ఇవి...

--విభజనకు ముందు పంచభక్ష పరమాన్నాలతో కూడిన హోదా ఇస్తామని చెప్పి, ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక అన్ని రాష్ట్రాల వలె సాధారణ నిధులను ఇస్తూ దానికి ప్రత్యేక ప్యాకేజీ అని ముసుగు తొడిగి రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెడతారా?

-- పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టకండి,పెద్దలు 'రాయపాటి' గారు ఒక సారి ఆలోచించండి.

-- ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాల తోనే మీరు తెలంగాణా యువతకి కోపం తెప్పించి,'ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు' అన్న అపవాదు మొత్తం జాతి కే తీసుకొచ్చారు

--మీ దురాశలకి,డబ్బు, పదవి వ్యామోహానికి భావి తరాల భవిష్యత్తు ని పాడు చేసే హక్కు మీకు లేదు.

--యువత పోరాట స్పూర్తిని "సుజనా చౌదరి గారు" పందులు పందాలు తో పోల్చడం ' చాల భాదాకరం.

-ఇంక మీరు నోరు జారే కొద్ది యువత ని రెచ్చగొట్టటమే.. సరే అలాగే కానివ్వండి. ఆంధ్రలోని ప్రతి యువకుడు, యువతి.. మనల్ని వెటకారం చేసే గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి నాయకుడి దాకా ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకోవాలి.

--ప్రత్యేక హోదా కోసం పోరాట పటిమ చూపిన తెలుగు ప్రజలకు, ముఖ్యంగా యువతకు నా జేజేలు. నిన్న, ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్న జనసేన కార్యకర్తలతో సహా ప్రతీ ఒక్కరినీ పోలీసులు బేషరతుగా తక్షణం విడుదల చేయాలి. జైహింద్

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News