కోడికత్తులతో హత్యలా.? పవన్ ఆగ్రహం

Update: 2018-11-14 07:43 GMT
కోడి కత్తులతో హత్యలు చేసే స్థాయికి రాజకీయాలు దిగజారాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనను పవన్ తీవ్రంగా ఖండించారు.  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

  టీడీపీ కుల రాజకీయాలపై కూడా పవన్ మండిపడ్డారు. కుల దూషణలకు పాల్పడుతున్న టీడీపీ నేతలను సహించబోమని హెచ్చరించారు.   ‘తేడా వస్తే నాలో ఉన్న మరో వ్యక్తిని చూస్తారు’ అంటూ పవన్ ఘాటు హెచ్చరికలు చేశారు. ఇప్పటికే మా తరం వాళ్లు కుల రాజకీయాల వల్ల తెలంగాణలో అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పవన్ ప్రజలను కోరారు. నిరుద్యోగులు, ఆడపడుచులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. కాకినాడ పోర్టులో భారీ అవినీతి జరుగుతోంది.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మూసివేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
   

Tags:    

Similar News