ఫ్రస్టేషన్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారా అంటే కనిపెట్టి మరీ అదే నిజం అంటోంది వైసీపీ. పవన్ నాలుగు అంటారు నాలుగు తిట్టించుకుంటారు. ఆయన వారాహి రధమెక్కి చేస్తున్న ప్రసంగాలు దారుణంగా ఉన్నాయని వైసీపీ అంటోంది. పూర్తి అసహనంతోనే ఆయన రాజకీయం చేస్తున్నారని విశ్లేషిస్తోంది.
పవన్ చేస్తున్న ప్రకటనలు అంటున్న మాటలు తీవ్ర ఆరోపణలు అన్నీ ఆయన ఫస్ట్రేషన్ లో ఉన్నారని తెలియచేస్తున్నాయని మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అంటున్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపు అవకాశాలు లేకనే ఒక వైపు లోకేష్ మరో వైపు పవన్ అలా విమర్శలు చేస్తూ తన అసహనాన్ని వెళ్ళగక్కుతున్నారని అన్నారు.
ఇది మంత్రి గారి మాట. కాసేపు దాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే ఈ నెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర ప్రారంభించారు. ఇప్పటికి పన్నెండు రోజులుగా జనంలోనే ఉన్నారు ఆయన మాటలు ప్రకటనలు కాస్తా ఆలోచిస్తే వైసీపీని ఓడించాలని పిలుపు ఇస్తూనే తాను ఓడిపోతాను అని అంటున్నారు. అయినా పోరాటం చేయాల్సిందే అంటున్నారు.
అదే విధంగా తనను సుపారీ గ్యాంగులను పెట్టించి చంపడానికి చూస్తున్నారు అని అంటున్న పవనే వైసీపీ మీద చేస్తున్న పోరాటంలో తన జీవితం ఏమవుతుందో అని మరో వైపు నిరాశావాదంతో కూడిన డైలాగులు కొడుతున్నారు. నేను ఓటమిని కలత చెందను అంటూనే రెండు చోట్ల ఓడించినందుకు బాధపడ్డాను అంటున్నారు.
అందరూ కలసి రాకపోతే వైసీపీని ఓడించడం కష్టం అంటూనే వైసీపీని గోదావరి జిల్లాలలో అసలు ఉండనీయను అంటున్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన కామెంట్స్ ఆయన చేయడం వెనక ఫ్రస్టేషన్ ఉందనే వైసీపీ నేతలు మంత్రులు అంటున్నారు. మరో వైపు చూస్తే తనను ఓడించడానికి వైసీపీ కోట్ల రూపాయలు బయటకు తీస్తుందని కూడా పవనే చెబుతున్నారు.
ఇక పవన్ అసహనం ఎక్కువై జగన్ మీద దందాల ఆరోపణలు కూడా చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన ఏమి మాట్లాడినా జగన్ ప్రస్థావన తీసుకుని వస్తూ విమర్శలు చేయడం వెనక అసహనమే ఉందని అంటున్నారు. ప్రభాస్ ఒక్కో సినిమా తీస్తే అయిదు నుంచి వేయి మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పిన పవన్ ఈ జగన్ వల్ల ఎవరికి ఉపాధి వచ్చిందని ప్రశ్నించడం ఇక్కడ విశేషం.
జగన్ హైదారాబాద్ లో కూర్చుని సెటిల్మెంట్స్ చేశారు అని పవన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిజానికి లక్ష కోట్లు తిన్న జగన్ని ఎన్నుకోవద్దు అని 2014 నుంచి పవన్ చంద్రబాబు చెబుతున్నా 2019లో ఆయన్నే జనాలు ఎన్నుకున్నారు. రాజకీయాల్లో అవినీతి పెద్ద అంశం కాదని ప్రూవ్ అయిందని అంటున్నారు.
ఇక జగన్ సొంత బాబాయ్ ని చంపిన వారిని వెనకేసుకుని వస్తున్నారని అని ఆయనవి రక్తం తడిసిన చేతులు ఈయన సీఎం గా మనకు కావాలా అని పవన్ మరో సభలో అన్నారు. అంతే కాదు ఈ గూండాలు ఈ రౌడీలు ఈ దరిద్రులు అంటూ ఆయన పిఠాపురం సభలో చాలా ఆవేశపూరితంగా స్పీచ్ ఇచ్చారు.
ఇలా పవన్ మాట్లాడుతూ ఆవేశానికి లోను కావడమే ఫస్ట్రేషన్ అని వైసీపీ అంటోంది. జగన్ని ఓడించలేకనే ఇలా ఆయన అంటున్నారు అని అంటోంది. రోజుకో సభలో జగన్ అవినీతి పరుడు, బాబాయ్ హత్య లో ఆయన వైపే అన్ని చూపులు ఉన్నాయని ఎంత చెప్పినా మళ్ళీ అవే చెబుతున్నారు పవన్. నిజానికి పవన్ స్పీచ్ లో కొత్తదనం లేకుండా పోయిందని కామెంట్స్ పడుతున్నాయి. ఆయన ఆవేశం కూడా జనాలకు అలవాటు అయిందని అంటున్నారు.
పవన్ ఏపీని బాగు చేస్తాను అంటే జనాలు ఎందుకు వినడం లేదు అన్నది ఆలోచిస్తే ఆ ఫ్రస్ట్రేషన్ కి జవాబు దొరుకుతుంది అని అంటున్నారు. తాను మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తాను ఏపీని నాకు అప్పగించండి అంటే జనాలు నమ్ముతారేమో కానీ ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నానో కూడా చెప్పకుండా తాను వెళ్ళిన నియోజకవర్గంలో కనీసం తన పార్టీ వారిని కూడా అభ్యర్ధిగా పరిచయం చేయకుండా సాగుతున్న పవన్ యాత్ర పూర్తిగా జగన్ మీద తిట్ల దండకమే అని వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా ఫ్రస్ట్రేషన్ పవన్ లో పెరిగిందా అంటే ఆయన రాజకీయ తడబాట్లే దానికి కారణం అని కూడా అంటున్న వారూ ఉన్నారు.