ప్రజారాజ్యం టీంకు పవన్ ప్రయారిటీ

Update: 2017-10-25 10:24 GMT
మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఆయనత పాటు ఆయన్ని నమ్మిన వాళ్లందరికీ చేదు అనుభవాన్నే మిగిల్చింది. చిరు ఏదో చేస్తాడని ఆశించి ఈ పార్టీలో భాగస్వాములైన వాళ్లకు ఆ తర్వాత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన చాలామంది వ్యక్తులు ఆ తర్వాత సైలెంటైపోయారు. ఐతే ప్రజారాజ్యం ప్రస్థానం ముగిసిన కొన్నేళ్లకు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టి ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రజారాజ్యంతో దెబ్బ తిన్న వాళ్లందరికీ మళ్లీ ఆశలు పుట్టాయి. ఐతే ప్రజారాజ్యం దారుణ ఫలితాన్నందుకున్న నేపథ్యంలో ఆ పార్టీలో పనిచేసిన వాళ్లకు పవన్ అవకాశమిస్తాడా లేదా అన్న సందేహాలు నెలకొనగా.. వాటికి తెరదించుతూ పీఆర్పీ జనాలకు తన పార్టీలోనూ బాగానే ప్రయారిటీ ఇస్తున్నాడు పవన్.

పీఆర్పీతో.. చిరుతో సన్నిహితంగా మెలిగిన జర్నలిస్టు హరి ప్రసాద్.. ప్రస్తుతం జనసేన పార్టీ మీడియా వ్యవహారాలు చూస్తుండటం విశేషం. మరోవైపు ప్రజారాజ్యం పార్టీలో పవన్ తో కలిసి పని చేసిన శేఖర్ గౌడ్ ఇప్పుడు జనసేన తెలంగాణ బాధ్యతలు తీసుకున్నారు. శేఖర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీ తరఫున గట్టిగానే ప్రచారం చేశాడు. 2009లో ఆ పార్టీ తరఫున జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ చేశాడు. మరోవైపు పవన్ పెట్టిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీపీఎఫ్)లో కీలకంగా వ్యవహరించిన వ్యాపారవేత్త మహేంద్ర రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ జనసేన వ్యవహారాలు చూస్తున్నారు. ఇంకా ప్రజారాజ్యం.. సీపీఎఫ్ ల్లో కీలకంగా వ్యవహరించిన మరికొందరు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News