ఈ తిట్లను వింటే పవన్ హేపీ ఏమో?

Update: 2018-01-10 16:25 GMT
కొన్ని తిట్లు అంతే.. వినడానికి చాలా సమ్మగా ఉంటాయి. బహుశా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా ఇప్పుడు అలాంటి అనుభవమే ఎదురవుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఓ నాయకుడు... కేసీఆర్ ను చెడా మడా విమర్శంచేసే ప్రక్రియలో  భాగంగా.. పనిలో పనిగా  పవన్ ను కూడా ఒక విడత ఉతికి ఆరేసేశాడు. అసలే ఇప్పుడు ఒకవైపు కత్తి మహేష్ విమర్శలకు రిటార్టులు ఇచ్చినందుకు ‘ఎందుకు కెలికాంరా భగవంతుడా’ అని పశ్చత్తాపపడుతున్న సమయంలో.. మరో తెలంగాణ నాయకుడు ఇంచుమించుగా అదే తరహా విమర్శలతో సదరు నాయకుడు చేసిన ఒక విమర్శ మాత్రం పవన్ కు హేపీగా అనిపించవచ్చు.

వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు - మాజీ ఎంపీ  వి. హనుమంతరావు (వీహెచ్) ప్రత్యర్థుల మీద ఒక రేంజిలో విరుచుకుపడే అలవాటున్న వారిలో ఒకడు. కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో కాపుల ఓట్లను రాబట్టుకోడానికి ఇప్పటినుంచే పవన్ కల్యాణ్ కు గేలం వేస్తున్నాడనేది వీహెచ్ ఆరోపణ. ఆయన విమర్శ కేసీఆర్ మీదనే అయినా.. ‘తనకు కులం అంటగడతారా?’ అని నివ్వెరపోతూ.. ‘‘తాను విశ్వమానవుడిని.. తనకు కులం లేదు మతం లేదు’’ అని చెప్పుకుంటూ ఉండే పవన్ కల్యాణ్ కు తనను అధికారంలోకి రాదలచుకున్న పార్టీలకు  కాపుల ఓట్లను ఇప్పించే యంత్రంలాగా అభివర్ణిస్తున్నట్లుగా వీహెచ్ మాట్లాడడం బాధ కలిగించవచ్చు.

అయితే.. వీహెచ్ మరో విమర్శ ఆయనకు హేపీనే. అదేంటంటే.. కాపుల్లో పవన్ కల్యాణ్ కంటె.. ముద్రగడ పద్మనాభం కే ఫాలోయింగ్ ఎక్కువ అని హనుమంతరావు తేల్చి చెప్పేశారు. కనీసం ఈ కామెంట్ చూసి.. ‘చూశారా.. నన్ను కాపు నాయకుడు అంటారుగా.. నేను కాపు కులం ఫాలోయింగ్ లో నెంబర్ వన్ ని కాను.. నామీద కాపు ముద్ర వేయడం కరెక్టు కాదన్నమాట.. ’’ అని పవన్ వాదించుకోవడానికి వీహెచ్ ఓ అవకాశం ఇచ్చనట్లయింది.

ఈ తిట్లు విమర్శల సంగతి లా ఉన్నప్పటికీ.. గత ఎన్నికల సమయంలో ఒకరినొకరు పరస్పరం నిందించుకున్న పవన్ కల్యాణ్ – కేసీఆర్ లమధ్య సఖ్యత కుదరడం వీహెచ్ కు ఇష్టం లేనట్లుంది. అప్పటి గొడవలను ప్రస్తావిస్తూ.. పవన్ ను మంచి చేసుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అంటున్నారు. అయితే అందరూ.. తన సినిమా అవసరం కోసం పవనే వెళ్లి కేసీఆర్ ను కీర్తించాడని అనుకుంటూ ఉంటూ.. ఈ భేటీని రివర్స్ గేర్ లో విహెచ్ వివరించడం చిత్రమే.
Tags:    

Similar News