పవన్ కంటి సమస్య మళ్లీ మొదటికి వచ్చిందా? అంటే.. అవునని చెబుతున్నాయి జనసేన వర్గాలు. ఆ మధ్యన పవన్ కంటికి సమస్య రావటం.. దాంతో ఆయనకు శస్త్రచికిత్స చేయటం తెలిసిందే. పవన్ కంట్లో కరుపు రావటం..దాని కారణం ఆయన తీవ్ర ఇబ్బందికి గురి కావటం తెలిసిందే. గత నెలలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది.
ఆ తర్వాత తగిన విశ్రాంతి తీసుకోవాలంటూ ఆయనకు వైద్యులు సూచించారు. కానీ.. పవన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు. పర్యటనలు చేయటం ద్వారా.. కంటి సమస్యను మళ్లీ కొనితెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆయన కళ్లు ఇన్ఫెక్షన్ కు గురైనట్లుగా చెబుతున్నారు.
దీంతో.. కంటి సమస్య మళ్లీ రావటంతో ఆయనకు మరోసారి శస్త్రచికిత్స అనివార్యమైంది. ప్రముఖ నేత్ర వైద్యనిపుణులు డాక్టర్ సంతోష్ జి. హోనావర్ అధ్వర్యంలో బంజారాహిల్స్ లోని సెంటర్ ఫర్ సైట్ కంటి ఆసుపత్రిలో ఈ రోజు మరోసారి శస్త్రచికిత్సను చేశారు.దీంతో.. ఆయన్ను ఈ నెలాఖరు వరకూ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే ప్రజా పోరాట యాత్రను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.