పే...ద్ద జెండా ఎగుర‌వేసిన ప‌వ‌న్‌

Update: 2018-05-10 09:58 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ మ‌ధ్య‌న ఏపీలో కొన్ని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన ఆయ‌న హైద‌రాబాద్‌లోని త‌న కార్యాల‌యానికే ప‌రిమిత‌మ‌య్యారు. తాజాగా ఆయ‌న ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప‌వ‌న్ క‌ల్యాణ్.. భారీ జాతీయ జెండాను ఎగుర‌వేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించిన ప‌వ‌న్‌.. 1947 జులై 22న జాతీయ జెండాకు నెహ్రు అధ్వ‌ర్యంలో స‌భ్యుల బృందం ఓకే చెప్పింద‌ని.. జెండాలో రంగులు.. ధ‌ర్మ చ‌క్రం రెండూ జాతీయ స‌మైక్య‌త‌కు నిద‌ర్శ‌నంగా చెప్పుకొచ్చారు. కాషాయం మీద త‌ర‌చూ వినిపించే వాద‌న‌కు కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌టం గ‌మ‌నార్హం.

జాతీయ జెండా అంటే ఏ దో ఒక పార్టీ కాద‌ని.. ఏదో ఒక మ‌తానికి చెందిన‌ది కూడా కాద‌ని చెప్పారు. జెండా ప్ర‌తి ఒక్క‌రిద‌ని స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ చెప్పిన‌ట్లుగా గుర్తు చేశారు. జాతీయ జెండాలోని కాషాయం.. హిందువుల‌ది కాద‌ని.. రాజ‌కీయ నేత‌లు స్వ‌లాభం లేకుండా నిస్వార్థంగా సేవ చేయాల‌న్నారు. ఆ విష‌యాన్ని జాతీయ జెండాలోని కాషాయం స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పారు.

త‌న‌కు జాతీయ జెండాను చూసిన ప్ర‌తిసారీ ఉవ్వెత్తున ఎగిసిప‌డే గుండెధైర్యం.. దేశాన్ని ముందుకు తీసుకెళ్ల‌గ‌లిగే ఆత్మ‌స్థైర్యం వ‌స్తుంద‌న్నారు. యూత్ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆయ‌న‌.. దేశ‌భ‌క్తిని రాజ‌కీయ నాయ‌కులు మ‌ర్చిపోయార‌న్నారు. భార‌త్ మాతాకీ జై.. జైహింద్ అంటూ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు ప‌వ‌న్‌. స్పీచ్ అయ్యాక తిరిగి వెళ్లే స‌మ‌యంలో చిన్నపాటి తొక్కిస‌లాట చోటు చేసుకుంది.

ప‌వ‌న్ ను చూసేందుకు ఆయ‌న అభిమానులు పోటీ ప‌డ్డారు. ఆయ‌నకు ద‌గ్గ‌ర‌గా చేరుకునేందుకు విప‌రీతంగా ప్ర‌య‌త్నించారు.ఈ నేప‌థ్యంలో కొంత తోపులాట జ‌రుగుతుందేమోన‌న్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే.. పోలీసులు అలెర్ట్ అయిన‌.. ప‌వ‌న్ ను సుర‌క్షితంగా వాహ‌నంలోకి ఎక్కించి పంపేశారు.


Tags:    

Similar News