ఎక్కడో మొదలైన వ్యవహారం అంతకంతకూ మలుపులు తిరుగుతూ ఎక్కడికెక్కడికో వెళుతోంది. పవన్ తల్లిని అవమానించేలా అసభ్యంగా తిట్టాలంటూ శ్రీరెడ్డికి రాంగోపాల్ వర్మ సలహా ఇవ్వటం.. దానిని పాటించటం.. ఆ విషయాన్ని వర్మ బయటపెట్టటం తెలిసిందే.
నాటి నుంచి పరిణామాలు ఊహకు అందనంత వేగంగా మారిపోతున్న సంగతి తెలిసిందే. పవన్ వర్సెస్ వర్మ.. పవన్ వర్సెస్ కొన్ని మీడియా సంస్థలన్నట్లుగా మాటల యుద్ధం సాగుతున్న వేళ.. కాపు ఉద్యమనేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పవన్ కు ఒక లేఖ రాశారు. పవన్ చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆయన రాసిన లేఖలో టీడీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు విమర్శలు.. ఆరోపణలు చేసిన ముద్రగడ.. పవన్ కు పలు సలహాలు ఇస్తూ లేఖ రాయటం గమనార్హం.
తెలుగుదేశం పార్టీని సముద్రంలో నిమజ్జనం చేసే దాకా నిద్రపోవద్దని ముద్రగడ సూచించారు. ఒక మెట్టు దిగి అవకాశం ఉన్నంతలో ఇతర పార్టీల సహకారం తీసుకొని బాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. 2014 ఎన్నికల్లో కాపుజాతిని అడుక్కొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. పవర్లోకి వచ్చేక తొలుత దళితుల్ని.. తర్వాత కాపు రిజర్వేషన్ అంశంపై పోరాడుతున్న వారిని లాఠీలతో కొట్టించారన్నారు. 2014 ఎన్నికల్లో మిమ్మల్ని అడుక్కొని పవర్లోకి వచ్చిన చంద్రబాబు..
ఇచ్చిన హామీల్ని అమలు చేయమని కోరితే తమను పోలీసులతో టార్గెట్ చేశారన్నారు.
కాపుల రిజర్వేషన్ల అమలు కోసం తాము ఉద్యమిస్తే.. తన భార్యను.. కోడల్ని పట్టుకొని ఈడ్చుకొచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దుర్మార్గుడిని మీరు భుజం మీద ఎక్కించుకొని ఊళ్లు తిప్పి అపర మేధావి.. కొత్త రాష్ట్రానికి పరిపాలనాధ్యక్షుడు అంటూ ప్రజలకు పరిచయం చేసి పట్టాభిషేకం చేయించారంటూ పవన్ పై తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మీ అమ్మగారికి జరిగిన అవమానం పక్కన పెట్టి.. రోడ్డు మీదకు వచ్చి టీడీపీని సముద్రంలో నిమజ్జనం చేసే వరకూ ఇంటి ముఖం చూడొద్దని పవన్ కు ముద్రగడ సూచించారు. పచ్చ పార్టీని.. ఆ పార్టీని సపోర్టు చేసే టీవీ ఛానళ్లు.. మీ కుటుంబాన్ని అవమానించిన విషయంలో అందరూ బాధపడుతున్నట్లు ముద్రగడ వెల్లడించారు. ఇలాంటిది ఎవరికి జరిగినా అందరూ ఖండించాలన్నారు.
2014 ఎన్నికల వేళలో ఏ దారి లేక కాపుజాతిని.. పవన్ ను అడుక్కొని అధికారం చేపట్టిన చంద్రబాబు.. తర్వాత ఒక్కో వర్గాన్ని అణిచివేస్తూ వచ్చారన్నారు. దళితులపై.. అణగారిన వర్గాలపై నిత్యం దాడులు చేయిస్తున్నారని.. ఘోరమైన బూతులు తిడుతూ దూషిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను లేవనెత్తిన కాపు రిజర్వేషన్ కు మద్దతుగా చిరంజీవి.. దాసరి మద్దతు పలకటంతో తాను ఆనందించినట్లు చెప్పారు. పవన్ తన కుటుంబానికి జరిగిన అవమానంపై కేసు పెట్టి కోర్టుకు వెళ్లాలనే ప్రయత్నంతో ఆగిపోవద్దని.. అందరిని కలుపుకుపోవాలన్నారు. టీడీపీని సముద్రంలో కలిపివేయాలన్నారు.
ఈ సందర్భంగా మీడియాపై తీవ్రంగా మండిపడ్డారు.ఎదుటివారి తల్లిదండ్రులు.. భార్య.. పిల్లల్ని టీవీవాళ్లు అవమానిస్తారని.. ఇలా అవమానించిన వారికి భార్యాపిల్లలు లేరా? వారికి కుటుంబాలు ఉండవా? అంటూ ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న వారు పాపపు సొమ్ముతో.. మదమెక్కి ప్రోత్సహిస్తున్నారన్నారు. నిత్యం అవమానాలతో మీరు ఇల్లు కదలకుండా కుట్ర చేస్తున్నట్లుగా ముద్రగడ అనుమానం వ్యక్తం చేశారు.