తెలుగుదేశం పార్టీతో జనసేన ఎన్నికల పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని - అయితే ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి తెలుగుదేశంతో ఉండాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పార్టీ సీనియర్ నాయకులతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో రానున్న శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని - ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే జనసేన కీలక మవుతుందని పవన్ కళ్యాణ్ అంచనావేస్తున్నారు అంటున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే చంద్రబాబుకు జనసేన మద్దతు ఇవ్వడమా... లేక జనసేనకు చంద్రబాబు మద్దతివ్వడం అనేది తేలుతుందని పవన్ కళ్యాణ్ సీనియర్ నాయకుల వద్ద ప్రస్తావిస్తున్నారు. ఆనాటి పరిస్థితిని బట్టి వ్యవహరించాల్సి ఉంటుందని, అందుకే తెలుగుదేశం పార్టీపై విమర్శనాస్త్రాలను తగ్గించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చినట్లు చెబుతున్నారు.
కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జనసేన అధ్యక్షుడు పైన - ఆ పార్టీ నాయకుల పైన విమర్శలు తగ్గించాలని తెలుగు తమ్ముళ్లకు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో ఎవరు ఎవరికి మిత్రులు అవుతారు.. ఎవరితో శత్రుత్వం నడపాలో ఇంకా తేలలేదని - అలాంటి స్థితిలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు తగవని చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు చెబుతున్నట్లు సమాచారం. ఇలా ఒకరిపై ఒకరు పైకి కోపాన్ని చూపించుకుంటూనే - లోలోపల మాత్రం ఎన్నికల అనంతరం కలిసి పనిచేయాలని లోపాయకారి అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నారు.