ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమ నిర్మాణానికి సమాయత్తమవుతున్న జనసేన అధినేత గత ఎన్నికల నాటి తన మిత్రులు టీడీపీ - బీజేపీలతో పూర్తిగా విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అంతేకాకుండా... ఇటీవల కాలంలో ఏ నేతా ఎత్తుకోని రీతిలో ఆయన దక్షిణాదిపై ఉత్తరాదివారి వివక్ష అంటూ కొత్త గళం ఎత్తుకున్నారు. దీంతో నేషనల్ మీడియా కూడా ఈ జనసేన ఏంటి.. పవన్ ఎవరు అంటూ ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ జాతీయ ఛానళ్లయిన సీఎన్ ఎన్18 - ఏఎన్ ఐ వంటి ఛానళ్లతో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజీ - ఉత్తరాది ఆధిపత్యం - తన భవిష్యత్ కార్యాచరణ వంటి అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. తాను ప్రత్యేక హోదా కోసం ఉద్యమించడం ఖాయమని.. అందులో అనుమానమే లేదని పవన్ చెప్పారు. అయితే.. దీనికోసం తాను తొందరపాటు లేకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానన్నారు.
టీడీపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో రాజీపడిపోయిందని.. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కిమ్మనడం లేదని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అనేది హోదాతో సమానమని.. అంతకంటే ఎక్కువని చెబుతున్నారని.. ఇది ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోందని అన్నారు. ఉత్తర, దక్షిణ భారత దేశాల ప్రజల మధ్య విభజన లేకపోయినా నాయకుల మధ్య స్పష్టమైన విభజన ఉందని.. ఉత్తరాది నేతలకు దక్షిణాది అంటే వివక్ష అని పవన్ చెప్పుకొచ్చారు. బీజేపీ చిన్నరాష్ట్రాలకు అనుకూలమైతే విదర్భను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఏపీని మాత్రమే ఎందుకు విడగొట్టారన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజల్లో సెంటిమెంటు బలంగా ఉందని.. దీన్ని సాధించుకోవడానికి తన వంతు ప్రయత్నం ఉంటుందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/