పార్టీ పెట్టి నాలుగేళ్లు దాటుతున్నా.. ఎప్పుడూ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయలేదు జనసేనాధినేత పవన్ కల్యాణ్. గతానికి భిన్నంగా ఈసారి మాత్రం.. ఈ నెల 14న గుంటూరు సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవటం.. అందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
రికార్డు స్థాయిలో జనసమీకరణ చేయాలన్న లక్ష్యంతో జనసేన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సభకు సంబంధించి టీజర్లు.. పొట్టి వీడియోల్ని విడుదల చేస్తూ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియోల్ని చూసినంతనే.. గుంటూరు సభకు హాజరు కావాలన్న భావన కలిగేలా చేస్తోంది. భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్న వేళ.. లక్షలాదిగా యూత్ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఇలాంటి వేళ.. అనుకోనిది ఏదైనా జరిగినా.. ప్రమాదవశాత్తు అత్యవసర పరిస్థితి చోటు చేసుకుంటే.. ఎవరికి ప్రాణాపాయం కలగకుండా ఉండేందుకు 400 మంది ప్రాణరక్షకుల పేరుతో ఒక టీంను సిద్ధం చేశారు. గతంలో ఏ రాజకీయ పార్టీ అనుసరించిన కొత్త పద్ధతికి పవన్ శ్రీకారం చుడుతున్నారని చెబుతున్నారు. 400 మంది వైద్య విద్యార్థులు.. కాలేజీ విద్యార్థులతో పాటు హౌస్ సర్జన్లు సైతం ఈ టీంలో ఉంటారు.
సభకు హాజరైన సందర్భంగా ఎవరికైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంటే.. అప్పటికప్పుడు తక్షన వైద్య సాయం అందేలా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టంపై థియరీ.. ప్రాక్టికల్ క్లాసుల్ని నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే ప్రతిఒక్కరూ వచ్చినంత క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలన్న జాగ్రత్తల్ని పవన్ తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన చాలా కచ్ఛితంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి జాగ్రత్తలు అన్ని రాజకీయ పార్టీలకు అవసరమని చెప్పక తప్పదు.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View