జనసేన పార్టీ కార్యాలయ అడ్రస్ మారనుంది. ఇప్పటివరకూ జనసేన కార్యాలయం జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో ఉంది. వాస్తవానికి జనసేన పార్టీకార్యాలయానికి రావాలంటే అదో పెద్ద ప్రయత్నంగా చెప్పాలి. వంకర టింకర రోడ్లతో పాటు.. నివాస ప్రాంతాల మధ్యలో ఉండే పార్టీ కార్యాలయం కారణంగా.. ఇరుగుపొరుగు వారికి తీవ్ర ఇబ్బందిగా మారినట్లు చెబుతారు.
రెసిడెన్షియల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయం కారణంగా.. అక్కడి కాలనీ వాసులంతా తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నట్లు చెబుతారు. దీనికి తోడు.. జనసేన కార్యాలయం ఫలానా అన్నట్లు గుర్తించే విధంగా లేకపోవటం.. ఒక చిన్న డూప్లెక్స్ లో పార్టీ ఆఫీసు నడపటం ఇబ్బందికరంగా మారింది.
కార్యకర్తలు.. నేతలు రావటం కష్టంగా మారటంతో పాటు.. పలువురు స్థానికులు పార్టీ ఆఫీసు విషయంలో అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఏర్పాటు చేయనున్న జనసేన పార్టీ ఆఫీస్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గరలో స్టార్ట్ చేయనున్నట్లు చెబుతున్నారు.
త్వరలో పార్టీ కొత్త కార్యాలయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓపెన్ చేస్తారని చెబుతున్నారు. కొత్త కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం ఉన్న పార్టీ ఆఫీసును క్లోజ్ చేస్తారని తెలుస్తోంది. మరి.. కొత్త ఆఫీస్ అయినా.. అందరికి అనువుగా ఉంటుందా? అన్నది ప్రశ్నగా మారింది.