ప్రశ్నించటం కోసం రాజకీయ పార్టీని పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తాజాగా తన పార్టీ కార్యాలయాన్ని స్టార్ట్ చేశారు. అయినా.. ఎప్పుడో పెట్టిన జనసేన పార్టీకి ఇప్పటివరకూ ఆఫీస్ లేదా? అన్న డౌట్ రావొచ్చు. పార్టీ ఆఫీస్ గా అడ్రస్ ఉంది కానీ.. అందులో ఆఫీస్ సెటప్ లేదు. తాజాగా ఆ లోటును తీరుస్తూ.. ఇండిపెండెంట్ హౌస్ ను కార్యాలయంగా హంగులు అద్ది సిద్ధం చేశారు.
జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో ఉన్న జనసేన పార్టీ ఆఫీసును.. ఇప్పుడు సరికొత్త హంగులు అద్ది సిద్ధం చేశారు. పూజాదికార్యక్రమాలు నిర్వహించి పార్టీ ఆఫీసును అధికారికంగా స్టార్ట్ చేసినట్లుగా ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు పవన్ కల్యాణ్ వర్గీయులు.
ఎప్పటిలానే.. తాను.. తనకు సన్నిహితులు.. ఎంపిక చేసిన కొద్దిమంది మధ్య పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు పవన్ కల్యాణ్. భరతమాత సాక్షిగా వివిధ మతాల పూజల మధ్యన కార్యాలయ ప్రారంభం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేక రూంతో పాటు.. పార్టీ కోసం పని చేసే వారికి అవసరమైన స్పేస్ ను సిద్ధం చేశారు.
ఇప్పటివరకూ ఏదో ఆపీస్ అంటే ఆఫీస్ అన్నట్లుగా ఉన్న దాని నుంచి ఆఫీస్ రూపంలో మార్చారు. కంప్యూటర్లు.. ప్రింటర్లు లాంటివి ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. పూజా కార్యక్రమంతో పాటు.. కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలోని అన్ని విభాగాల్ని పవన్ పరిశీలించారు. ఎప్పటిలానే మీడియాను పిలవని పవన్.. తనకు బాగా దగ్గరైన కొద్దిమంది సినీ ప్రముఖుల్ని ఆహ్వానించారు.
తనకు క్లోజ్ గా ఉండే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. హాస్యనటుడు ఆలీతో పాటు.. టాలీవుడ్ పెద్దల్లో ఒకరైన దగ్గుబాటి సురేశ్ తదితరుల్ని ఆహ్వానించారు. పార్టీ కోసం పని చేస్తున్న వారి కంటే కూడా.. తన మీడియా సలహాదారు.. తన పీఆర్వో తదితరుల్ని పిలిచిన పవన్.. పార్టీ కార్యాలయ ప్రారంభాన్ని ఒక ప్రైవేటు కార్యక్రమంగానే నిర్వహించారని చెప్పక తప్పదు.
సరికొత్త హంగులతో మొదలైన పార్టీ ఆఫీస్.. తర్వలోనే పూర్తిస్థాయిలోనే తన కార్యకలాపాల్ని మొదలు పెడుతుందని చెబుతున్నారు. తన టైంలో మూడొంతులు ప్రజాజీవితానికేకేటాయిస్తానని పవన్ చెప్పటం తెలిసిందే. అయితే.. క్యాలెండర్లో తేదీలు మారుతున్నా పవన్ చెప్పినట్లుగా మాత్రం జరగని పరిస్థితి. ఏది ఏమైనా.. హైదరాబాద్ లోని ప్రారంభమైన పార్టీ ఆఫీస్ తో పాటు రానున్న కొద్ది రోజుల్లో అమరావతిలోనూ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పవన్ పిలిచిన వ్యక్తి గురించి వింటే కాస్తంత ఆశ్చర్యపోవాల్సిందే. రెండు దశాబ్దాలుగా దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని.. స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థ ఆవిష్కృతం కావాలని ఆశిస్తూ.. గోడల మీద స్ఫూర్తివంతమైన నినాదాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన జనసేన కార్యకర్త నిమ్మల వీరన్నను పిలవటం పవన్ మార్క్ గా చెప్పాలి. ఇప్పటివరకూ వన్ మ్యాన్ షోగా నడుస్తున్న జనసేన పార్టీ.. కొత్త కార్యలయం స్టార్ట్ అయిన నేపథ్యంలో సరికొత్తగా మారుతుందేమో చూడాలి.