ప‌వ‌న్ నోట ఇక‌పై ఫిన్లాండ్ మాట‌లు!

Update: 2018-08-06 05:30 GMT
మ‌న చుట్టూ ఎంతో మంది ఎన్నో చేస్తుంటారు. మంచి వాటిని స్ఫూర్తిగా తీసుకోవ‌టం.. వాటిని ప‌క్కాగా అమ‌లు చేయ‌టంలో ప్ర‌భుత్వాలు ప్ర‌ద‌ర్శించే నిర్ల‌క్ష్యం.. అశ్ర‌ద్ధ పుణ్య‌మా అని దేశ ప్ర‌జ‌ల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాని ప‌రిస్థితి. అధినేత‌లు ఎంత మంది వ‌చ్చినా.. ఎన్ని మాట‌లు చెప్పినా.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం అవేమీ క‌నిపించ‌ని దుస్థితి. అయితే.. ఈ లోపాలకు దిద్దుబాటు మీద పోరాటం మానేసి.. స‌రికొత్త విధానాలంటూ కొత్త కొత్త కాన్సెప్ట్ ల్ని తెర మీద‌కు తీసుకురావ‌టంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

తాజాగా అలాంటి ప‌నే షురూ చేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునే చూస్తే.. ఇజ్రాయిల్ అంటారు.. సింగ‌పూర్ అంటారు. ఇక‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అయితే ఇస్తాంబుల్‌.. లండ‌న్ అంటూ బ‌డాయి మాట‌లు చెబుతారు. కానీ.. ఆచ‌ర‌ణ‌లో అవేమీ రాని ప‌రిస్థితి.

ఇప్పుడు ప‌వ‌న్ వంతు వ‌చ్చింది. ఫిన్లాండ్‌ లో విజ‌య‌వంత‌మైన కొన్ని విద్యా విధానాల్ని స్ఫూర్తిగా తీసుకు రావాల‌ని.. వాటిని ఏపీలో ద‌శ‌ల వారీగా ఎంత‌వ‌ర‌కూ అమ‌లు చేయొచ్చో అన్న విష‌యంపై అధ్య‌య‌నం చేయాలంటూ ప‌వ‌న్ చెబుతున్నారు. ముందు మ‌న విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోపాల్ని ఎత్తి చూపించి.. వాటి మీద పోరాడ‌టం లాంటివి ఏమీ చేయ‌కుండా.. అత్యున్న‌త విధానాల్ని ఎన్నింటిని తీసుకొచ్చినా వాటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉండ‌వ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

విద్యా విధానంలో ఫిన్లాండ్ త‌ర‌హా అంశంపై అధ్య‌య‌నం చేసి..  ఈ నెల 14న పార్టీలో జ‌రిగే స‌మావేశంలో సుదీర్ఘంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. నాణ్య‌మైన విద్య‌ను అందించ‌టం జ‌న‌సేన ల‌క్ష్యంగా చెబుతున్నారు. ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. ఇత‌ర వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు వ‌స‌తి గృహాలు.. పాఠ‌శాల‌ల్లో నాణ్య‌త ప్ర‌మాణాల్ని పెంపొందించ‌టం జ‌న‌సేన ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు.

హాస్ట‌ల్స్ లో ప‌రిశుభ్ర‌త‌తో కూడిన పౌష్టికాహారం అందించ‌టం.. స‌రైన గాలి.. వెలుతురు వ‌చ్చేలా వాటిని చూడ‌టం.. బాలిక‌ల వ‌స‌తి గృహాల్లో త‌గిన ర‌క్ష‌ణ ఉండేలా చేయ‌టం త‌మ ల‌క్ష్యంగా చెబుతున్నారు. ఇలాంటి ల‌క్ష్యాలు.. ఆశ‌యాలు కోటి ఉన్నా.. వాటి ఆచ‌ర‌ణ చాలా కీల‌క‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అధికారం చేతిలోకి వ‌చ్చే అవ‌కాశం లేకున్నా.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ మాట‌లు చెప్ప‌టంలో మాత్రం ప‌వ‌న్ రోజురోజుకూ బిజీ అవుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.



Tags:    

Similar News