కాలుకు దెబ్బ తగిలితే తల మీద మందు రాసేవాళ్లను చూశారా..? కాలు నొప్పికి.. తలకి ఏమైనా సంబంధం ఉందా..? తల అందంగా ఉంది కదా అని మట్టి కాలుకు పూయవల్సిన మందు తలకు పూస్తారా..? ఇప్పుడు ఏపీ తెలంగాణలో అదే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఏపీ సంక్షేమాల కోసం పెట్టే ఈ మీటింగులు ఏపీలో జరగాలే కానీ.. హైదరాబాద్ లో ఎందుకు జరుపుతున్నట్టు అనే సందేహాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన నిజనిర్ధరణ కమిటి సమావేశంలో ఒక రోజు పూర్తయింది. ఈ మీటింగ్ హైదరాబాద్ లోని దస్పల్లా అనే స్టార్ హోటల్లో జరిగింది. తొలి రోజు కమిటి తీర్మానించింది ఏమిటో లోక్ సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ మీడియా మిత్రులకు తెలిపారు. వారం లోజుల్లో నిజాలు బయటపెట్టేస్తాం అనే జేపి ప్రకటించడం చాలా కీలకమైన విషయం.
పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఈ జేఎఫ్ సీ మీటింగ్ కు అన్నీ పార్టీల నాయకులు - నిపుణులు మరికొందరు పాల్గొన్నారు.
శుక్రవారం జరిగిన ఈ మీటింగ్ లో ఏపీ రాష్ట్రం శ్రేయస్సు కోరుకునే నిపుణులు మేధావులు మాజీ అధికారులు నేతలు పాల్గొన్నారు. నిత్యం పాదదర్శకమైన పరిపాలన కోసం పోరాడే జయప్రకాష్ నారాయణ, మరియు ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం గళమెత్తుతుండే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అలాగే ప్రత్యేకహోదా తప్పనిసరి అనే చలసాని శ్రీనివాస్ - విభజన హామీలన్నీ ఇచ్చి తీరాల్సిందే అనే కాంగ్రెస్ నేతలు - అందరూ ఏదో ఒక రూపంలో.. ఏపీ శ్రేయస్సును కాంక్షించేవారికే.
అయతే ఇలాంటి మీటింగ్ ను ఏపీలో కాకుండా హైదరాబాద్ ఏసీ హోటల్లో జరిపించారు. పోరాడేది ఆంద్రప్రదేశ్ కోసం అయినప్పుడు.. ఆ పోరాటమేదో ఆంధ్ర గడ్డ మీద చేస్తే శ్రేయస్కరంగా ఉంటుందని ప్రజల అభిప్రాయం. జేఎఫ్ సీ రెండు రోజుల సమావేశం శనివారం ముగుస్తుంది. కమిటీ తరఫున మరికొన్ని సమావేశాలు కూడా ఉంటాయని జేపీ ప్రకటిస్తూనే ఉన్నారు. కనీసం ఈసారి జరగబోయే మీటింగులన్నా ఏపీ లో నిర్వహిస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు.
ఏపీకి సంబంధించిన మీటింగ్ - ఏపీ లో మేధావులతో కలిసి ఏపీలోనే జరపాలి తప్ప హైదరాబాద్ స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టడంతో ఏం చెప్పాలనుకుంటున్నారో? ఆ నేలమీదనే సమావేశం నిర్వహిస్తే.. అది పవన్ కల్యాణ్ గానీ - కమిటీ పెద్దలు గానీ.. తమ చిత్తశుద్ధిని మరింతగా నిరూపించుకునే ప్రయత్నం అవుతుంది కదా... అని పలువురు భావిస్తున్నారు.