కొంతకాలంగా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీతో తెగదెంపులు చేసుకున్న అనంతరం పవన్...వారి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజమండ్రి లో బహిరంగ సభ సందర్భంగా మరోసారి చంద్రబాబు - లోకేష్ లపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ గా కూడా గెలవని వ్యక్తిని...పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గా చేసిన ఘనత చంద్రబాబుదని పవన్ మండిపడ్డారు. మీ అబ్బాయికేం తెలుసని పంచాయితీ రాజ్ శాఖ మంత్రిని చేశారని పవన్ సూటిగా ప్రశ్నించారు. తండ్రి అనుభవం కొడుకుకు వస్తుందని లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టారా అని పవన్ దుయ్యబట్టారు. మళ్లీ మీరే రావాలని చంద్రబాబు గారి గురించి హోర్డింగ్స్ విపరీతంగా పెట్టారని....చంద్రబాబు మళ్లీ వచ్చి ఏం చేస్తారని పవన్ నిప్పులు చెరిగారు.
చంద్రబాబు, లోకేష్ లకు....పవన్ బహిరంగ సభ నుంచి వార్నింగ్ ఇచ్చారు. 14 ఏళ్ల వయసులలోనే తాను సమాజం, దేశానికి సేవ చేయాలని సంకల్పించానని పవన్ అన్నారు. ఆ విషయం తన అమ్మ - నాన్నలకు తెలుసని....అన్నయ్యకు కూడా తెలీదని అన్నారు. మాట్లాడితే పవన్ సినీ యాక్టర్ అని అంటుంటారని, రాజకీయాలను అర్థం చేసుకొనే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ కు ఏం తెలుసని మంత్రిని చేశారని పవన్ అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో గెలవని వ్యక్తిని...పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఎలా చేశారని ప్రశ్నించారు. మీ అబ్బాయికేం తెలుసని పంచాయితీ రాజ్ శాఖ మంత్రిని చేశారని దుయ్యబట్టారు. ఎక్కడైనా...తండ్రి వారసత్వం కొడుక్కు రావాలని.. ..ఇంటిపేరు..తండ్రి రూపు రేఖలు...డీఎన్ , ఆస్తిపాస్తులు రావడం సహజమని అన్నారు. కానీ, చంద్రబాబు నాయుడు... తన...అనుభవం తన కొడుకుకు వారసత్వంగా రావాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మీ కొడుకును సీఎం చేయడానికి నేను టీడీపీకి కాపు కాసింది అని ప్రశ్నించారు.