ప్రశ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ జనసేనకు సోమవారంతో ఎనిమిది సంవత్సరాలు నిండుతాయి. 2014, మార్చి 14న హైదరాబాద్ వేదికగా పురుడు పోసుకున్న జనసేన... ఇప్పటికి ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళగిరి వేదికగా.. సోమవారం.. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు శ్రీకారం చుట్టారు. దీనిని భారీ ఎత్తున విజయవంతం చేయాలని.. పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏకంగా 12 కమిటీలను నియమించి.. సభను విజయవంతం చేసేలా కృషి చేస్తున్నారు.
సభకు ముందే.. పవన్ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. ఆవిర్భావ సభ.. రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలకు వారధిలాంటిదని అన్నారు. సోమవారం నిర్వహించే ఆవిర్భావ సభ వేదిక నుంచే భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. సభకు రానీయకుండా ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తే.. అక్కడకు వెళ్లడం తమ హక్కుగా చెప్పాలని పార్టీ కార్యకర్తలు, ఆఅభిమానులు, ప్రజలకు పవన్ సూచించారు.
రాష్ట్ర భవిష్యత్ కోసం, తెలుగు ప్రజల ఐక్యత కోసం జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటంలో జరిగే సభకు వచ్చి విజయవంతం చేయాలని శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. రెండున్నరేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులపై ఈ సభా వేదికగా గళమెత్తుతానని అన్నారు.
ఈ వేదిక నుంచే భవిష్యత్తు రాజకీయ కార్యచరణపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామన్నారు. సభా ప్రాంగణానికి తాను ఎంతగానో అభిమానించే దామోదరం సంజీవయ్య పేరు పెట్టినట్లు తెలిపారు. సభకు రానీయకుండా ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తే.. సభకు వెళ్లటం మా హక్కు అని చెప్పాలని సూచించారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లు చేసిన నాయకులను పవన్ అభినందించారు.
"భవిష్యత్ ఆశల వారధి జనసేన ఆవిర్భావ సభ. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సభ. రెండున్నరేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులపై గళమెత్తుతా. ఈ వేదిక నుంచే భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం. సభ కోసం పార్టీ శ్రేణులు 10 రోజులుగా కష్టపడ్డారు. సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు.`` అని పవన్ వ్యాఖ్యానించారు.
భావి తరాలకు ఎలాంటి భరోసాను కల్పిస్తే బలమైన భవిష్యత్తును ఇవ్వగలమనే విషయంపై తాను పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభలో మాట్లాడబోతున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ సభకు రానివ్వకుండా ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పోలీసులను అడ్డుగా పెట్టి.. తమ సభకు రానివ్వకుండా ఇబ్బందులను కల్పించాలనుకోవడం సరికాదని చెప్పారు. సభ విజయవంతం కావడానికి సహకరించాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
నాగబాబు ఆధ్వర్యంలో
ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు.. జనసేన బాగానే కసరత్తు చేసింది. ఈ క్రమంలో జిల్లాల సమన్వయ కమిటీ, ఆహ్వాన కమిటీ, లైజన్ కమిటీ, ట్రాన్స్‌పోర్ట్ కమిటీ, సభా ప్రాంగణ నిర్వహణ కమిటీ, క్యాటరింగ్ కమిటీ, భద్రత నిర్వహణ కమిటీ, సాంస్కృతిక కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా కోఆర్డినేషన్ కమిటీ, వలంటీర్ల కమిటీ, మెడికల్ అసిస్టెన్స్ కమిటీలను అపాయింట్ చేసింది. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, సీనియర్ నాయకుడు నాగబాబు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు