ప‌వ‌న్ నియోజ‌క‌వ‌ర్గం ఫిక్స‌యిందా?

Update: 2018-10-13 19:12 GMT
2019 ఎన్నిక‌ల్లో ఏపీలోని 175 స్థానాల్లో జ‌న‌సేన పోటీ చేయ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంద‌రు అభ్య‌ర్థుల‌ను జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. రాబోయే ఎన్నిక‌ల్లో అనంత‌పురం నుంచి  జనసేనాని పోటీ చేయ‌బోతున్నార‌ని ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా గుంత‌క‌ల్లు నుంచి ప‌వ‌న్ పోటీచేయ‌బోతున్న‌ట్లు వ‌దంతులు వినిపిస్తున్నాయి. అయితే, రెండు సెంటిమెంట్ ల దృష్ట్యా ప‌వ‌న్ ఆ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ ఆరాధ్య దైవం ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం గుంత‌క‌ల్లులో ఉండ‌డంతో సెంటిమెంట్ గా ఆ స్థానాన్ని ప‌వ‌న్ ఎంచుకున్నార‌ట‌. ఇక‌, గుంత‌క‌ల్లులో గెలిచిన పార్టీ అధికారాన్ని చేప‌డుతుండ‌డంతో ప‌వ‌న్ అక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది.

గ‌త చ‌రిత్ర ప్ర‌కారం కూడా గుంత‌క‌ల్లులో గెలుపు సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతోంది. 1983లో హిందూపుర్ నుంచి ఎన్టీఆర్ రాజ‌కీయ అరంగేట్రం చేశారు. ఆ త‌ర్వాత హిందూపుర్ టీడీపీ కంచుకోట‌గా మారింది. ఇప్ప‌టిదాకా హిందూపుర్ లో టీడీపీ ఓట‌మి ఎరుగ‌దు. ఇక‌, 2014లో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా హిందూపుర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2008లో ప్ర‌జారాజ్యం స్థాపించిన త‌ర్వాత చిరంజీవిని రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు ఆద‌రించారు. తిరుప‌తిలో చిరు గెలుపు బావుటా ఎగుర‌వేయ‌గా....పాల‌కొల్లులో ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో, అన్న చిరు సెంటిమెంట్ ను ప‌వ‌న్ ఫాలో కాబోతున్నార‌ట‌. అందుకే, అన్న త‌రహాలోనే రాయ‌లసీమలోని గుంత‌క‌ల్లు నుంచి పోటీ చేయ‌బోతున్నార‌ట‌. అయితే, ప‌వ‌న్...ఒక్క గుంత‌క‌ల్లుకే ప‌రిమిత‌మ‌వుతారా...లేక చిరులాగా కోస్తాలో మ‌రో చోట నుంచి కూడా పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News