బాబుకు ప‌వ‌న్ స‌రికొత్త అల్టిమేటం

Update: 2017-08-29 17:03 GMT
త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వానికి.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అల్టిమేటం ఇవ్వ‌టం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అల‌వాట‌న్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వ్య‌వ‌సాయ విద్యార్థుల స‌మ‌స్య‌పై ఆయ‌న స్పందించారు. త‌న‌ను క‌లిసిన వ్య‌వ‌సాయ విద్యార్థుల‌తో భేటీ అయిన ప‌వ‌న్.. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.  గ‌డిచిన 25 రోజులుగా స‌మ్మె చేస్తున‌న ఏపీలోని 11 వ్య‌వ‌సాయ క‌ళాశాల‌ల విద్యార్థులకు సంబంధించిన ప్ర‌తినిధులు తాజాగా ప‌వ‌న్ ను వ‌చ్చి క‌లిశారు.

ఏపీ వ్యాప్తంగా వ్య‌వ‌సాయ క‌ళాశాల్ల‌లో చ‌దువుతున్న మూడు వేల మంది బీఎస్సీ విద్యార్థుల ప్ర‌తినిధులు త‌న‌ను క‌లిసి త‌మ స‌మ్మెకు గ‌ల కార‌ణాల్ని వివ‌రించిన‌ట్లుగా ఆయ‌న చేసి ట్వీట్ల‌లో వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయ అధికారుల నియామ‌కాల‌లో గ‌తంలో ఉన్న జీవో నెంబ‌రు 16ను కొన‌సాగించాల‌ని.. తాజాగా విడుద‌ల చేసిన జీవో నెంబ‌రు 64ను నిలిపివేయాల‌న్నారు.

తెలంగాణ‌లో నేటికీ జ‌వో నెంరు 16ను కొన‌సాగిస్తున్న విష‌యాన్ని ప‌వ‌న్ దృష్టికి తీసుకొచ్చారు వ్య‌వ‌సాయ‌ విద్యార్థులు. తాము చేస్తున్న స‌మ్మె కార‌ణాల్ని ప‌వ‌న్‌కు వివ‌రించిన వారు.. ఉమ్మ‌డి రాష్ట్రానికి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో విడుద‌లైన జీవో నేటికీ తెలంగాణ‌లో అమ‌లు అవుతుంటే.. ఏపీలో మాత్రం దాన్ని నిలిపివేశార‌న్నారు. విద్యార్థుల వాద‌న‌లో న్యాయం ఉంద‌ని.. వారి డిమాండ్లు త‌న‌కు స‌హేతుకంగా అనిపించాయ‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ‌టం విశేషం.

ఏపీలోని 11 వ్య‌వ‌సాయ క‌ళాశాల‌లకు చెందిన 3 వేల మంది వ్య‌వ‌సాయ విద్యార్థులు చేస్తున్న స‌మ్మెను.. వారికి సంబంధించిందిగా జ‌న‌సేన చూడ‌టం లేద‌ని.. ల‌క్ష‌లాదిగా ఉన్న అన్న‌దాత‌లు.. వారి కుటుంబాల‌కు చెందిన స‌మ‌స్య‌గా భావిస్తున్న‌ట్లుగా ప‌వ‌న్ ట్విట్ట‌ర్ లో ట్వీట్ రూపంలో వెల్ల‌డించారు. మ‌రి.. ప‌వ‌న్ కోరిన‌ట్లుగా జీవో నెంబ‌రు 64ను ఏపీ స‌ర్కారు నిలిపివేస్తుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News