జ‌నం మ‌ధ్య‌లో జ‌న‌సేనాని ఇక్క‌ట్లు!

Update: 2018-09-24 10:28 GMT
సాధార‌ణంగానే సినీ తార‌లు ప‌బ్లిక్ ప్లేసుల‌కు - పుణ్యక్షేత్రాల‌కు వెళ్లిన‌పుడు వారిని చూసేందుకు అభిమానులు ఎగ‌బ‌డుతుంటారు. ఇక పొలిటిషియ‌న్ గా మారిన సినీ న‌టుల‌కు ఇటు కార్య‌కర్త‌లు - అటు అభిమానుల తాకిడి ఎక్కువ‌. అందుకే, వారు జనం మ‌ధ్య‌లోకి వెళ్లాల్సిన‌పుడు ప్రైవేటు భ‌ద్ర‌తా సిబ్బందితోపాటు ....పోలీసుల స‌హ‌కారం కూడా త‌ప్ప‌నిస‌రి. ఇదే త‌ర‌హాలో నెల్లూరు రొట్టెల పండుగ‌కు హాజ‌రైన జ‌న‌సేన అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ కూడా పోలీసుల స‌హ‌కారం కోరారు. కానీ, ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప‌వ‌న్ కు పోలీసుల స‌హాయ‌స‌హ‌కారాలు అర‌కొర‌గా అందాయి. దీంతో, జ‌నం మ‌ధ్య‌లో జ‌న‌సేనాని దాదాపు 20నిమిషాల పాటు చిక్కుకుపోయారు. టీడీపీతో ప‌వ‌న్ తెగ‌దెంపులు చేసుకున్న నేప‌థ్యంలోనే ప‌వ‌న్ కు స‌రిప‌డినంత భ‌ద్ర‌త సిబ్బందిని కేటాయించ‌లేదని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

వాస్త‌వానికి నెల్లూరులో ప‌వ‌న్ ప‌ర్య‌టించ‌డం టీడీపీకి ఇష్టం లేదు. కాబ‌ట్టి, త‌న ప‌ర్య‌ట‌న గురించి ముందుగానే సమాచారం ఇచ్చినా పోలీసు శాఖ అనుమ‌తి నిరాక‌రించింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్....దర్గాకు వచ్చే స‌మ‌యాన్ని కూడా మారుస్తూ వ‌చ్చారు. చివ‌రి నిమిషంలో పోలీసుల అనుమ‌తి ల‌భించడంతో ఆయ‌న అక్క‌డ ప‌ర్య‌టించారు. అయితే, ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది మొత్తాన్ని ద‌ర్గా లోప‌లికి అనుమ‌తించ‌లేదు. మ‌రోవైపు, ప‌వ‌న్ కు భ‌ద్ర‌త క‌ల్పించేంత మంది పోలీసులు అక్క‌డ లేక‌పోవ‌డంతో ఆయ‌న ఇబ్బంది పడ్డారు. ప‌వ‌న్ ప్రైవేటు సిబ్బంది, అర‌కొర‌గా ఉన్న పోలీసులు....జ‌నాన్ని అదుపుచేయ‌లేక‌పోవ‌డంతో ప‌వ‌న్ జ‌నం మ‌ధ్య‌లో చిక్కుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు జ‌న‌సేనాని జనం మ‌ధ్య‌లో ఉండిపోయారు. దీంతో, ప‌వ‌న్ తో సెల్ఫీ దిగేందుకు కొంత‌మంది ఎగ‌బ‌డ్డారు. ప‌వ‌న్ మెడ‌లో కండువా వేసేందుకు, నెమ‌లి పింఛంతో ఆయ‌న‌ను ఆశీర్వ‌దించేందుకు ర‌క‌రకాలుగా కొంద‌రు ప్ర‌య‌త్నించారు. దీంతో, ప‌వ‌న్ తొలిసారి కొద్దిగా అస‌హ‌నానికి గుర‌య్యారు. ఎప్పుడూ అభిమానుల‌తో సంయ‌మ‌నం పాటించే ప‌వ‌న్...కొద్దిగా చిరాకు ప‌డ్డ‌ట్లు క‌నిపించింది. మండుటెండలో దర్గా దగ్గర 20 నిమిషాల పాటు జనం మధ్య నిలబడిపోవాల్సి  రావ‌డం వ‌ల్ల ఆ మాత్రం చిరాకు స‌హ‌జం. అయితే, కావాల‌నే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో పోలీసుల‌ను ఆ ఏరియాలో డ్యూటీ నుంచి తగ్గించార‌ని టాక్ వ‌స్తోంది. ఏది ఏమైనా ప‌వ‌న్ పై టీడీపీ ఈ ర‌కంగా రివేంజ్ తీర్చుకుంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
    

Tags:    

Similar News