బడ్జెట్ మీద మీ మాటేంది పవన్..?

Update: 2017-02-02 16:47 GMT
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన కొన్నేళ్ల మాదిరే ఈ వార్షిక బడ్జెట్ లోనూ కేంద్రం.. ఏపీకి మొండిచేయి చూపించిన సంగతి తెలిసిందే. అమరావతి రైతులకు ప్రకటించిన తాయిలం తప్పించి.. ఏపీకిపెద్దగా ఒరిగిందేమీ లేదు. రాజధాని కోసం భూములు ఇచ్చే వారినే కాక.. ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా ఇదే తీరును అమలు చేస్తే బాగుండేదన్న విమర్శ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో తరచూ ట్వీట్లు చేసే జనసేన అధిపతి పవన్ కల్యాణ్.. బడ్జెట్ పై స్పష్టత ఇస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది.

ఓపక్క బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగితే.. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన అనుచర వర్గం సంబరాలు చేసుకుంటున్న వైనాన్ని తప్పు పట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ పవన్ వైఖరిని ప్రశ్నించారు. ఓట్లకు నోటు కేసు తర్వాత ఏపీకి ఎంత అన్యాయం జరిగినా.. న్యాయం జరిగినట్లుగా ఫీల్ కావటం పెరిగిందని ఎద్దేవాచేసిన ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవటానికి కర్త.. కర్మ.. క్రియ చంద్రబాబేనని తీవ్రంగా మండిపడ్డారు.

తాజా బడ్జెట్ లోనూ విశాఖకు రైల్వే జోన్ ను ప్రకటించని వైనాన్ని గుర్తుచేసిన అమర్ నాథ్.. హోదా విషయంలో ముందుండి పోరాడాల్సిన చంద్రబాబు వెంకయ్యతో కలిసి వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు.హోదా కోసం వరుస ట్వీట్లు చేస్తున్న పవన్ కల్యాణ్.. వెంకయ్యనాయుడిపైనే విమర్శలు సంధిస్తున్నారు కానీ.. చంద్రబాబును విమర్శించటం లేదన్నారు. ప్రత్యేక హోదాకు బాబు వ్యతిరేకం కాదని పవన్ భావిస్తున్నారా? అని ప్రశ్నించిన ఆయన.. ఆ విషయంపై పవన్ స్పష్టత ఇస్తే బాగుంటుందన్నారు. మరి.. పవన్ ఈ ప్రశ్నలకు ఏం బదులిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News