పవన్ పొలిటీషియనేనా?

Update: 2016-01-27 09:56 GMT
జనసేన అధ్యక్షుడు, సినీహీరో పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రారని కన్ఫర్మయిపోయింది. ఇంతవరకు టీడీపీ - బీజేపీ నేతల్లో ఏ మూలో ఉన్న ఆశలూ పోయాయి. తాజాగా కేంద్ర మంత్రి - టీడీపీ నేత సుజనా చౌదరి పవన్ కు ఫోన్ చేసి గ్రేటర్ ప్రచారానికి రావాల్సిందిగా కోరగా ఆయన నో చెప్పినట్లు సమాచారం. తాను సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో ఉన్నానని... ఇప్పుడు రావడం ఎంతమాత్రం కుదరదని ఆయన చెప్పేశారని అంటున్నారు.

ఇంతకుముందు కూడా టీడీపీ నేతలు కొందరు పవన్ ను కలిసి ప్రచారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అప్పుడు కూడా పవన్ అంగీకరించలేదు.

మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తామని తొలుత ప్రకటించిన పవన్ ఆ తరువాత ఆ ఊసే ఎత్తలేదు. తన పార్టీని రంగంలోకి దింగలేదు సరికదా.... తాను మద్దతిస్తున్న టీడీపీ - బీజేపీల తరఫునా ఆయన ప్రచారానికి రాకపోవడంతో ఆయన అసలు పొలిటీషియనేనా అన్న విమర్శలు వస్తున్నాయి.
Tags:    

Similar News